మన ఆరోగ్యం బాగుండాలంటే తీసుకునే ఆహారం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది మంచి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. చాలామంది ఇంట్లో వండుకోవడానికి టైం లేక బయట ఆహారం తీసుకుంటూ ఉంటారు. నిజానికి బయట ఫుడ్ ని తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ సమస్య వస్తుంది. ఫుడ్ పాయిజన్ వలన ఎంతో ఇబ్బందిని ఎదురుకోవాల్సి వస్తుంది. బయట తీసుకునే ఆహారం వలన నీళ్లు వలన ఫుడ్ పాయిజన్ రావచ్చు. ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఉంటే వికారం, వాంతులు, కడుపునొప్పి, జ్వరం వంటి ఇబ్బందులు వస్తాయి. ఫుడ్ పాయిజన్ ఎవరిలో అయినా రావచ్చు. పిల్లల మొదలు పెద్దల వరకు ఎవరికైనా కలగొచ్చు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి.
మెంతులు కడుపులో సమస్యల్ని తొలగిస్తాయి కడుపులో నొప్పి వాంతులు వంటి ఇబ్బందులు నుండి బయట పడేస్తాయి. ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ మెంతులు వేసి ఈ మిశ్రమాన్ని తినేయండి దీంతో వాంతులు కడుపునొప్పి వంటి ఇబ్బందులు ఉండవు.
నిమ్మకాయ కూడా ఈ సమస్యను తొలగిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ వైరల్ గుణాలు ఇందులో ఉంటాయి ఫుడ్ పాయిజన్ అయితే ఆ సమస్య నుండి నిమ్మ బయటపడిస్తుంది. ఒక టీ స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా పంచదార కొద్దిగా సాల్ట్ వేసుకుని మూడుసార్లు రోజుకి తీసుకోండి ఇలా చేయడం వలన కూడా ఫుడ్ పాయిజన్ సమస్య నుండి బయటపడవచ్చు.
వెల్లుల్లిని గోరువెచ్చని నెలలో వేసుకుని తీసుకుంటే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమస్య నుండి బయటపడొచ్చు.
గోరువెచ్చని నీళ్లలో తేనె వేసుకునే మూడుసార్లు రోజుకి తీసుకుంటే కూడా సమస్య నుండి బయట పడిపోవచ్చు.
అల్లం నిమ్మరసం కలిపి తీసుకుంటే కూడా ఫుడ్ పాయిజనింగ్ సమస్య నుండి బయటపడొచ్చు.
అరటిపండు కూడా బాగా పనిచేస్తుంది పండిన అరటి పండు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడడానికి అవుతుంది. అరటిపండు తో బననా షేక్ ని చేసుకునే మూడుసార్లు రోజుకి తీసుకుంటే కూడా ఫుడ్ పాయిజన్ సమస్య ఉండదు.