డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవడానికి పాటించాల్సిన సూచనలు..

-

కరోనా మహమ్మారి భయం జనాల్లోంచి ఇంకా వెళ్ళకముందే డెంగ్యూ రూపంలో మరో వ్యాధి విలయ తాండవ చేస్తుంది. వర్షాకాలంలో విజృంభిస్తున్న ఈ వ్యాధి బారిన చాలామంది పడుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. మరణాల సంఖ్య కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏడిస్ దోమ కాటు కారణంగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి క్రమ క్రమంగా పెరుగుతుంది. దీని కారణంగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

 

dengue

దీని బారి నుండి తప్పించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. దోమ కాటుకు గురి కాకుండా చూసుకోవడం, నీటి నిల్వ ఎక్కువగా లేకుండా చూడడం, అలాగే జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా డెంగ్యూ నుండి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవాలంటే ఏం చేయాలి?

విశ్రాంతి

రోగనిరోధక శక్తి పెరగడానికి రోగికి తగిన విశ్రాంతి అవసరం. తీవ్రమైన అలసట బాధిస్తున్నప్పుడు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

నీళ్ళు

రోజులో 3 నుండి 4లీటర్ల నీళ్ళు తాగాలి. పళ్ళరసాలు మంచి మేలు చేస్తాయి. ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవడం బాగుంటుంది. మజ్జిగ, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, సోంఫు నీళ్ళు, ఇంకా ఇతర చక్కెర లేని పళ్ళ రసాలు మంచి ప్రభావాన్ని చూపిస్తాయి.

ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? వేటిని పక్కన పెట్టాలి?

సిట్రస్ ఫలాలైన కివి, నారింజ, ఉసిరి, ఫైనాఫిల్ వంటి వాటిని తినాలి. దానిమ్మ, బొప్పాయిని కూడా భాగం చేసుకోండి. కూరగాయల రసాలను మర్చిపోవద్దు. చపాతీలను ముట్టుకోవద్దు. ఫాస్ట్ ఫుడ్ అసలే వద్దు. చక్కెర పక్కన పెట్టేయండి. దానివల్ల తొందరగా కోలుకోరు.

చిట్కాలు

బొప్పాయి ఆకుల రసం 20మిల్లీ లీటర్లు మాత్రమే తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం రెండు పూటలు తీసుకుంటే సరిపోతుంది. గోధుమ గడ్డి రసం కూడా మేలు చేస్తుంది. ఇంకా కొద్దిగా కోలుకున్న తర్వాత ఎండలోకి వస్తే విటమిన్ డి లభిస్తుంది. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news