వ్యాక్సిన్ వచ్చి 100 ఏళ్లు అయినా.. ఆ వ్యాధి తీవ్రత మాత్రం తగ్గడం లేదు

-

ప్రాణాంతకమైన వ్యాధుల్లో క్షయవ్యాధి కూడా ఒకటి. టీబీ వల్ల ఏటా 1.5 మిలియన్ల కంటే ఎక్కువ మందే చనిపోతున్నారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. ఇంత మొత్తంలో చనిపోతున్నారంటే.. దానికి కారణం.. వ్యాధి ఎలాంటి మందుకానీ, చికిత్స కానీ లేదనకుంటారేమో.. 100 ఏళ్ల కిందటే.. దీనికి వ్యాక్సిన్ కనిపెట్టారు.. అయినా..నేటికి ఇది ప్రాణాంతకమైన వ్యాధిలానే ఉంది. నిపుణులు, శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్ కనిపెట్టాల్సిన అవసరం ఉందని బల్లగుద్ది చెబుతున్నారు.

టీబీ వ్యాక్సిన్ వచ్చి ఇప్పటికే 100 ఏళ్లు దాటింది. దీని సామర్థ్యం కూడా తగ్గిపోయిందనేది నిపుణు అంటున్నారు. ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు తమ పరిశోధనా పత్రాలలో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. కొత్త వ్యాక్సిన్‌ను కనుకొనాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.

క్షయవ్యాధి (TB) అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సోకుంతుంది. ఈ వ్యాధికి చికిత్స అంటే యాంటీబయాటిక్స్‌తో నెలల తరబడి ఇంటెన్సివ్ థెరపీ చేయడమే… TBతో బాధపడే వ్యక్తులు దగ్గినప్పుడు రక్తం బయటికి వస్తుంది. అలాగే జ్వరం, చలి, బరువు తగ్గుతారు. అయితే లైసెన్స్ పొందిన ఏకైక TB వ్యాక్సిన్ BCG (Bacilli calmetre-gurin). దీనిని జూలై 1921లో కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ టీకా రక్షణ సామర్థ్యం కాలక్రమేణా తగ్గిందని, పల్మనరీ TB నుంచి రక్షించడంలో BCG విఫలమవుతుంని…అందుకే ఇప్పుడు TB కోసం కొత్త వ్యాక్సిన్‌లను కనుగొనడం చాలా అవసరమని వాళ్లు అంటున్నారు.

శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్ కనుగొనాలి అన్నా.. దానికి తగిన అనుమతలు ఇంకా రావాల్సి ఉంది. పరిస్థితి ఇలా ఉంటే.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది. రోగం వచ్చాక..జాగ్రత్తపడేకంటే.. టీబీ లాంటి ప్రాణంతకమైన వాటి భారిన పడకుండా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మంచి జీవనశైలి, పరిమితుల్లో..వ్యసనాలు ఉంచుకోవాలి. పొగత్రాగడం, మద్యం సేవించండి.. మితిమీరితే..ఎన్నో రోగాలు.. హద్దు దాటతాయి.

Read more RELATED
Recommended to you

Latest news