ప్రతిరోజు వేడి ఆహారం తినేవారికి ఈ 4 నష్టాలు తప్పవట..అతి వేడి మంచిది కాదు..!

-

చలికాలంలో వేడివేడి ఐటమ్స్‌ తింటుంటే బాగుంటుంది కదూ. ఎవరూ కూడా శీతాకాలంలో చల్లారిన ఆహారం తినడానికి ఇష్టపడరు. కొందరైతే..ఏ సీజన్‌ అయినా సరే..వేడి వేడి ఆహారాన్నే తింటుంటారు. వేడి వేడి అన్నం..ఆవకాయ, నెయ్యి కాంబినేషనే వేరయా..కానీ అన్ని వేళలా వేడివేడి ఆహారం వద్దయ్యా అంటున్నారు వైద్యులు. ఇది శరీరానికి హానిని కలిగిస్తుంది. చల్లటి ఆహారం రుచిగా లేకపోయినా వేడి వేడిగా తినడం మంచిది కాదు. వేడి ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో చూద్దాం.

గొంతు మంట:

వేడి-వేడి ఆహారం కారణంగా గొంతు లోపలి నుంచి కాలిపోతుంది. వాపు కూడా వస్తుంది. ఈ సమస్యని అనేక హోం రెమిడీస్‌తో తగ్గించుకోవచ్చు. కానీ ఒక్కోసారి పెద్దగా మారినప్పుడు వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.

పొట్టకు నష్టం:

శీతాకాలం కానీ ఏదైనా కాలం కానీ ఆహారం అతిగా వేడిగా తినడం ఆరోగ్యానికి అసలు మంచిదికాదు. డైలీ ఇలానే వేడివేడి ఆహారం తినడం వల్ల కడుపు దెబ్బతింటుంది. పొట్టలోపల ఉండే సున్నితమైన చర్మం పాడవుతుంది. ఫలితంగా..కడుపులో మంట, నొప్పి ఏర్పడుతాయి. దీర్ఘకాలంగా ఇదే అలవాటును పాటించటం వల్ల కలుగుతుంది. అప్పుడప్పుడు తింటే ఏం కాదు.

నాలుక కాలిపోతుంది:

పాయసం వేడిగా తింటేనే బాగుంటుంది..కానీ చాలామందికి పాయసం తాగేప్పుడు నోరు కాలే ఉంటుంది. ఆ మంట కనీసం నాలుగు రోజులు అయినా ఉంటుంది. ఒక్క పాయసమే కాదు..సూప్‌ లాంటివి తాగినప్పుడు కూడా.. ఇలా చేయడం వల్ల నోటిలోపల చాలా సమస్యలు వస్తాయి. ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

దంతాలకు నష్టం:

చాలా వేడి, చాలా చల్లదనం దంతాలకు హాని కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు..చాలా వేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల దంతాలలో ఉండే ఎనామిల్ పగుళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తద్వారా..దంతాల ఆరోగ్యం పాడవుతుంది. దీంతో పాటు దంతాల అందం కూడా దెబ్బతింటుంది.

ఈ సమస్యలన్నీ మీకు ఒక్కసారి తిన్నప్పుడే ఏర్పడవు. కొంతమందికి వేడివేడి ఆహారం..పొగలొచ్చేది తినటం అంటే ఇష్టం ఉంటుంది. నిజానికి అలా తింటేనే రుచిగా ఉంటుంది..కానీ రుచికంటే ఆరోగ్యం ముఖ్యం కదా..! అతి వేడి, అతి చల్లదనం ఏది నోటికి మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news