Fever: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా? తినకూడదా.. తింటే ఏమవుతుంది?

-

Fever: సాధారణంగా వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా కొన్నిసార్లు మనం అనారోగ్యానికి గురి కావలసి వస్తుంది. ఇలా జ్వరం వచ్చినప్పుడు నోరు మొత్తం రుచిని కోల్పోయి ఏదైనా స్పైసీగా తినాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. ఈ తరుణంలోనే చాలామంది జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినాలని భావిస్తూ ఉంటారు. అయితే పెద్దవాళ్లు మాత్రం జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని చెబుతూ ఉంటారు. అయితే జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే ఏమవుతుందన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మరి జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే ఏం జరుగుతుంది, అసలు తినవచ్చా లేదా అన్న విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా మనకు ఒంట్లో బాగా లేనప్పుడు మన జీర్ణ వ్యవస్థ పనితీరు కాస్త నెమ్మదిస్తుంది. అందుకే మనం తేలికగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలోనే అధిక పోషకాలు కలిగినటువంటి చికెన్ తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ పై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది తద్వారా అజీర్తి కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

ఇక మీకు చికెన్ తినాలి అనిపిస్తే చికెన్ బాగా ఉడక పెట్టి తక్కువ మోతాదులో ఉప్పు కారం వేసుకొని మాత్రమే తినాలి, మసాలాలు అసలు జోడించకూడదు. అలాకాకుండా గ్రిల్డ్ చికెన్, బిర్యానీ, అధిక మసాలాలతో తయారు చేసిన చికెన్ తినడం వల్ల పూర్తిగా జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే వీలైనంత వరకు జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news