జీవితకాలాన్ని పొడిగించాలని అనుకుంటున్నారా? ఈ ఒక్క వ్యాయామం చేయండి.

-

శారీరకంగా ఫిట్ గా ఉండడానికి చాలా రకాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. ఏ వ్యాయామం చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయన్న దాన్ని విశ్లేషించి, ఆచరించడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే ప్రతీసారీ విశ్లేషణ సాధ్యం కాదు. ఇలాంటి కన్ఫ్యూజన్ మీకూ ఉన్నట్లయితే సైక్లింగ్ చేయండి. అవును, ఎలాంటి వ్యాయామం చేయాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పి సైకిల్ చేతపట్టి కాళ్ళకు పని చెప్పండి.

సైక్లింగ్ ఎలా సాయపడుతుంది?

సైక్లింగ్ చేయడం చెప్పలేనన్ని లాభాలున్నాయి. దీనివల్ల గుండే ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెపోటు వంటి ఇబ్బందులను రాకుండా చూసుకుంటుంది. ఒత్తిడి, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులను రాకుండా అడ్డుకోవడంలో సైక్లింగ్ సాయపడుతుంది. అంతేకాదు సైక్లింగ్ కారణంగా డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ.

సైక్లింగే ఎందుకు?

1992 నుండి 200వరకు చేసిన ఒకానొక పరిశోధనలో సైక్లింగ్ చేసినవారు సాధారణ వ్యాయామాలు చేసిన వారి కంటే ఎక్కువ కాలం జీవించినట్లు సమాచారం. సుమారు 7వేల మందిపై నిర్వహించిన ఈ పరిశోధనలో ఇది తేటతెల్లమైంది. వ్యాధుల బారిన పడి తొందరగా జీవితకాలాన్ని ముగించకుండా ఉండేందుకు సైక్లింగ్ తోడ్పడుతుందని, ప్రొఫెసర్ మాతాయిస్ రైడ్ లార్సెన్ అధ్యయనం పేర్కొంటుంది.

ఎంతదూరం సైక్లింగ్ చేయాలి?

సైక్లింగ్ వల్ల జీవితకాలం పెరుగుతుందని తేలిన తర్వాత చాలామందికి వచ్చే ప్రశ్న ఇదే. ఒకరోజులో ఎంతదూరం సైక్లింగ్ చేయాలి అని. దీనిపై రకరకాల మంది రకరకాలుగా చెప్తారు. కాకపోతే మీకు మీరు సైక్లింగ్ ని ఎంతసేపు ఎంజాయ్ చేయగలరో అంతసేపు సైక్లింగ్ చేయడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news