జిమ్ కి వెళ్తే ఇవి అసలు మర్చిపోవద్దు…!

-

జిమ్ అనేది ఈ రోజుల్లో కొంత మందికి అలవాటుగా మారితే మరికొంత మందికి సరదాగా, మరికొంత మందికి వినోదంగా మారింది అనేది వాస్తవం. కాళీగా ఉన్న వాళ్ళు జిమ్ కి వెళ్తున్నారు, బిజీ గా ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. అంటే వెళ్ళకూడదు అని కాదు గాని వెళ్తే కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెప్తున్నాం అన్న మాట. అవి పెద్ద పెద్దవి కాదు అండి, చిన్న చిన్న జాగ్రత్తలే.

అవి ఏంటీ అనేది చూద్దాం.

దుస్తులు: జిమ్ లో ఏ దుస్తులు పడితే ఆ దుస్తులు వేసుకుని వెళ్ళకూడదు. జీన్స్ ఫాంట్ లాంటివి వేసుకుని వెళ్తే మీకే ప్రమాదం. వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరించాలంటే మాత్రం అనువైన దుస్తులు ధరించాలి. చెమటను పీల్చుకునే, సాగే గుణం కలిగిన దుస్తులు ధరించాలన్నమాట. అంటే కేవలం వ్యాయామాల కోసం ఉద్దేశించిన దుస్తులనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

రుమాలు: వ్యాయామాలు చేసే సమయంలో ఎక్కువగా స్వేదం విడుదలవడం అనేది సహజం. గాలిలో వేడి ఎక్కువగా ఉన్నా సరే ఇది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తుడుచుకోవడానికి వెంట కాటన్‌ రుమాలు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

షూస్‌: కాలిగి ధరించే షూ అనేది ఈ విషయంలో చాలా కీలకం. పాదం అడుగున వంపునకు ఆసరా అందించే షూస్‌ ఎంచుకుంటే పాదాల మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. చెమట పీల్చుకునే సాక్స్‌ ని ధరించడంతో పాటుగా చక్కని గ్రిప్‌ కలిగిన షూస్‌ ఎంచుకోవాలి. నాణ్యత విషయంలో ధర ఎక్కువైనా సరే రాజీ పడవద్దు.

వాటర్‌ బాటిల్‌: జిమ్‌లో నీటి సౌలభ్యం ఉన్నా సరే కచ్చితంగా వెంట నీళ్ల బాటిల్‌ తీసుకువెళ్తే ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఏ మాత్రం ఉండదు. ఇవి చిన్న చిన్నవే అయినా సరే కచ్చితంగా పాటించాలి.

Read more RELATED
Recommended to you

Latest news