గుండె ఆరోగ్యం బాగుండాలంటే ఈ వ్యాయమ పద్ధతులని పాటించండి..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆహారం కంటే కూడా ఫిజికల్ ఆక్టివిటీ చాలా ముఖ్యం. ప్రతి రోజూ 20 నిమిషాల పాటు వ్యాయామం కోసం సమయాన్ని కేటాయించాలి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలలో గుండె సమస్యలు ఒకటి.

 

గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే వ్యాయామ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. వీటిని అనుసరిస్తే తప్పకుండా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలానే గుండె ఆరోగ్యాన్ని మరింత పెంపొందించుకోవడానికి కూడా అవుతుంది. ఈరోజు ఆరోగ్యనిపుణులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు. వీటిని కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా గుండె సమస్యలు ఉండవు.

కార్డియో:

వ్యాయామ పద్ధతులు లాంటి వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ లాంటివి చేస్తే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి రోజూ మీ సమయంలో కాస్త సమయాన్ని కార్డియో ఎక్సర్సైజ్లకి వెచ్చించండి. వీటిని మీరు ఫాలో అవ్వడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.

స్ట్రెచ్చింగ్ మరియు వెయిట్ లిఫ్టింగ్:

మీరు స్ట్రెచ్చింగ్ చేయడం లేదా వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా గుండె సమస్యల నుండి బయట పడవచ్చు. వ్యాయామ పద్ధతులు లాంటి పుషప్స్, పుల్ అప్స్ లాంటివి మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

జంపింగ్ జాక్:

గుండె ఆరోగ్యానికి జంపింగ్ జాక్ కూడా బాగా పనిచేస్తుంది. ఇది చాలా సులభమైన పద్ధతి కూడా. దీని కోసం మీ దగ్గర ఎలాంటి మిషన్ ని కానీ కొనక్కర్లేదు. జిమ్ కి వెళ్లే అవసరం లేదు. కేవలం మీరు జస్ట్ నుంచుని జంపింగ్ చేస్తే సరిపోతుంది ఇలా కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యంగా ఫిట్ గా ఉండటానికి కూడా ఇవి మనకు సహాయం చేస్తాయి. కనుక తప్పకుండా వీటిని అనుసరిస్తూ ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news