ఆరోగ్యం పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా 20 లో ఉండే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అదే విధంగా అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువైపోయాయి.
20 ఏళ్లలో ఉండేవాళ్ళు సరైన బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. అలానే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం. అయితే ఇరవై వయసులో ఉండే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరోగ్యకరమైన చిట్కాలు పాటిస్తే మంచిది. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తి చేద్దాం.
ప్రోటీన్:
ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చికెన్, పన్నీర్ మొదలైన వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ ఆహారపదార్థాలను తప్పక తీసుకోండి.
క్యాల్షియం:
ఇది కూడా చాలా అవసరం. కాల్షియం లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. కాల్షియం సమృద్ధిగా ఉంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. నువ్వులు, ఆకుకూరలు, బ్రోకలీ, పాలు, పెరుగులో క్యాల్షియం ఉంటుంది.
ఐరన్:
ఐరన్ కూడా డైట్ లో ఎక్కువ ఉండాలి. ఐరన్ లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఐరన్ చికెన్ లివర్, సాల్మన్, పౌల్ట్రీ, పన్నీర్, బాదం వంటి వాటిలో ఉంటుంది. అదే విధంగా ఒత్తిడి లేకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇలా ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా ఆరోగ్యంగా ఏ సమస్యలు లేకుండా ఉండొచ్చు.