పిల్లలకి పోషకాహారాన్ని ఇలా అలవాటు చెయ్యండి..!

-

పిల్లలకి అన్ని ఆహార పదార్థాలు నచ్చవు. అంటే నచ్చని వాళ్ళని అలా వదిలేస్తే అస్సలు మంచిది కాదు. అలవాటు చేయలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. తప్పకుండా పిల్లలకి మంచి పోషక పదార్థాలను అలవాటు చేయాలి. కేవలం జంక్ ఫుడ్ వంటి వాటిని వాళ్ళకి పెడితే ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అయితే పిల్లలకు పోషక పదార్థాలని ఎలా అలవాటు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

 

childrens

పాలిచ్చేటప్పుడు తల్లులు ఇలా చేయండి:

బాగా చిన్న పిల్లలు అయితే మీరు పాలిచ్చేటప్పుడు వాళ్లతో ఐ కాంటాక్ట్ ఇవ్వండి. అలా వాళ్లకి పాలు పట్టిస్తే వాళ్ళు తాగుతారు లేదు అంటే వాళ్ళు తాగరు.

సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయండి:

ఒకసారి పిల్లలు కూర్చోవడం లేవడం నేర్చుకున్నాక వాళ్లకి సెల్ఫ్ ఫీడింగ్ ని అలవాటు చేయండి కొన్ని పండ్లు, ఉడికించిన కూరగాయలు పెట్టండి. ప్లేట్ లో మీరు రంగురంగుల కూరగాయలు పేర్చి చూడడానికి బాగుండేలా కట్ చేసి వాళ్ళకి ఇవ్వండి. ఒక్కోసారి పిల్లలు మనం అన్నం కలిపి నోట్లో పెడితే తినరు. అటువంటప్పుడు మీరు ఇడ్లీ చపాతీ వంటివాటితో ఇలా రంగురంగుల కూరగాయల్ని కట్ చేసి పెడితే వాళ్లు తినడానికి ఇష్టపడతారు.

వాళ్ళతో కూరగాయల్ని కొనండి:

అదే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్లని కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు తీసుకెళ్లండి. అప్పుడు వాళ్ళకి పండ్లు, కూరగాయలు ఎలా వస్తున్నాయి..?, ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. వాళ్లకి ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్, ఎరుపు ఇలా అన్ని రంగుల వాటిని కూడా కట్ చేసి పెడుతూ ఉండండి. లేదా ఒక రోటిలో కూరగాయల అన్నిటినీ పెట్టి పెట్టండి. ఇడ్లీ పైన క్యారెట్ తురుము పెట్టడం ఇలా కొత్త రకాలుగా ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే పిల్లలు మనం తినమంటే అస్సలు తినరు. అందుకని కొత్త కొత్తగా తయారు చేసి వాళ్ళకి పెడితే ఖచ్చితంగా వాళ్ళు తింటారు దీంతో ఆరోగ్యంగా వుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news