ఇవి తినడం వల్ల శృంగారంపై ఆసక్తి పెరుగుతుందట..!

-

కొందరికి యుక్త వయసులోనే శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది. దాని వల్ల సంతానం కలగదు. వీరు సెక్స్ పై ఇంట్రెస్ట్ పెరగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ఫుడ్ హాబిట్స్. శృంగారం పెరగడానికి కొందరు బాదం పప్పు నుంచి మునక్కాడల వరకు వివిధ రకాల ఆహారం తీసుకుంటారు. అయితే ఇవి నిజంగా సెక్స్ పై ఆసక్తిని పెంచుతాయా అంటే తెలియదు. ఎందుకంటే ఇవేం శాస్త్రీయంగా రుజువు కాలేదు. కానీ ఈ విషయంలో మెంతులు కాస్త మనకు ఉపశమనం కలిగిస్తాయి.

ఎందుకంటే మగవాళ్లు తమ ఆహారంలో మెంతులు తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. కొంతమంది పురుషులకు వారి ఆహారంలో రోజు మెంతుల రసం ఇచ్చి పరిశీలించగా 82 శాతం మందిలో శృంగారంపై ఆసక్తి పెరిగినట్లు తేలింది. అంతేకాదు 63 శాతం మందిలో శృంగార సామర్థ్యమూ మెరుగుపడటం గమనార్హం. మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇది టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి దోహదం చేస్తుండొచ్చన్నది పరిశోధకుల భావన.

 

సంతాన సమస్యలు ఎదుర్కొనే భార్యాభర్తల్లో పురుషులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి ముందుముందు డయాబెటిక్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది.
వీర్యంలో వీర్యకణాల సంఖ్య తక్కువగా గలవారిని ఎంచుకొని, ఇతరులతో పోల్చి చూడగా కొన్ని కొత్త సంగతులు బయటపడ్డాయి. సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల లోపు వారిలో మూడింటి ఒక వంతు మందిలో టెస్టోస్టిరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల స్థాయులు ఏడు రెట్లు తక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. వీరిలో ఎముక సాంద్రత కూడా తక్కువగా ఉంటోంది.

ముఖ్యంగా టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గినవారిలో ఇది ప్రముఖంగా కనిపిస్తోంది. దీని మూలంగా ఎముక క్షీణించటం, తేలికగా విరగటం వంటివి తలెత్తుతాయి. అంతేకాదు.. గ్లూకోజు స్థాయులను సూచించే హెచ్‌బీఏ1సీ కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇన్సులిన్‌ నిరోధకతా పెరుగుతోంది. ఇవి రెండూ మధుమేహం ముప్పును పెంచేవే కావటం గమనార్హం. అందువల్ల సంతాన చికిత్సలు తీసుకునే పురుషులంతా ఒకసారి సెక్స్‌ హార్మోన్ల పరీక్షలు చేయించుకోవటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. తీవ్రమైన జబ్బుల ముప్పులు గలవారు సంతాన చికిత్సల అనంతరం వాటిపై ఒక కన్నేసి ఉండటమూ మేలని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news