ధర పెరిగిందని టమోటాలు వాడటం మానేశారా..? పురుషుల్లో సంతాన సామార్థ్యం పెరగాలంటే తినాల్సిందే..

-

టమోటా ధరలు పెరిగాయని చాలా మంది వాటిని తినడం మానేశారు. ఏముందిలే టమోటాలు వాడకపోతే.. వేరే ఏదైనా కూరులు తెచ్చుకుందాం అనుకుంటున్నారుగా..! కానీ సంతానం కలగాలంటే టమోటాలను తినాలట.. పురుషుల్లో సంతానోత్పత్తి పెంచే సామార్ధ్యం టమోటాలకు ఉంది. ఈ విషయం మేం చెప్పడం లేదు. అధ్యయనం ద్వారా కనుగొన్నారండీ..!

టమోటాలలో ఉండే లైకోపీన్ అనే పోషకమే పురుషుల్లో వీర్యం నాణ్యతను పెంచుతుందని ఈ అధ్యయనం చెప్తోంది. పురుషులు రోజూ రెండు చెంచాల టమాట జ్యూస్‌ను తీసుకుంటే చాలు, లేదా టమాటోను నేరుగా తిన్న మంచిదే. వారి వీర్యం నాణ్యత పెరిగి సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఎలాంటి లోపాలు లేకుండా పుట్టే అవకాశం ఉంటుందట.

పిల్లలు కలగకపోవడం ఒక సమస్య అయితే.. పుట్టుకతోనే ఏదో ఒక లోపాలతో పుట్టడం మరో సమస్య. ఇలా సంతానోత్పత్తి సమస్యలు ఉన్న పురుషులపై ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. వారికి సంతానాన్ని కలగకుండా చేసే కారకాలను కనిపెట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. అలాగే వారి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే విషయాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్న పురుషులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతో పాటు మంచి జీవనశైలిని అనుసరించాలని చెబుతున్నారు వైద్యులు. అలాగే లోదుస్తులు బాగా బిగుతుగా ఉండేవి వేసుకోకూడదని, వదులుగా ఉండే వాటినే ధరించాలని చెబుతున్నారు.

గర్భం దాల్చే అవకాశాలు పెరగాలంటే

స్త్రీ పురుషలిద్దరూ ఒత్తిడిని తగ్గించుకొని తరచూ లైంగిక చర్యలో పాల్గొనాలని వైద్యులు చెప్తున్నారు.

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే ఆహారంపై కూడా విస్తృతంగా అధ్యయనం చేశారు. అందులో విటమిన్ ఇ, జింక్ లాగే లైకోపీన్ కూడా మంచి యాంటీ యాక్సిడెంట్‌లా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ అధ్యయనంలో భాగంగా 60 మందికి లైకోపీన్ సప్లిమెంట్లను ఇచ్చి అధ్యయనం నిర్వహించారు. 12 వారాలపాటు ట్రయల్స్ జరిగాయి. ఆ తర్వాత వారి వీర్యాన్ని పరీక్షించారు. మరింత చిక్కదనం కనిపించింది, అంటే లైకోపీన్ తీసుకున్న తర్వాత వీర్యకణాలు ఆరోగ్యంగా ఎదగడంతోపాటు వాటి సంఖ్య కూడా పెరిగింది. అలాగే అవి కదిలే చలనశీలత కూడా మెరుగుపడినట్టు వారు గుర్తించారు. కాబట్టి పిల్లల కోసం ప్రయత్నిస్తున్న దంపతులు రోజూ రెండు స్పూన్ల టమోటో జ్యూస్‌ను తాగితే ఎంతో మంచిది.

ఖరీదైనది అని ఏది మానతున్నాం చెప్పండి.. అన్నీ తప్పక తీసుకుంటున్నాం కదా.. ఇక పాపం టమోటాలను ఎందుకు వదిలేయండి. కేజీ 800 పెట్టి మటన్‌ తీసుకోని ఒక్కరోజులు తినేస్తాం. టమోటాలు కేజీ వందనే కదా మరీ.. కాబట్టి ఒక వారం నాన్‌వెజ్‌ మానేస్తే టమోటాలు వచ్చేస్తాయి అనుకోని ముందుకెళ్లడమే.!

Read more RELATED
Recommended to you

Latest news