అంజీర్ పండ్లు ఇష్ట‌మమి అతిగా తింటున్నారా.? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

-

ఈ సీజన్ లో మనుక ముఖ్యంగా దొరికే పండ్లలో ఒకటి అంజీరా పండు. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదే..చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ వీటిని తినొచ్చు. అనేక ఆరోగ్య సమస్యలనుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫైబ‌ర్‌, కార్బోహైడ్రేట్స్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు అంజీర్ పండ్ల‌లో నిండి ఉండ‌టం వ‌ల్ల‌ ఇవి ఆరోగ్యప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి. సంతానలేమి సమస్యతో బాధపడేవారికి ఈ పండు చాలా మంచిది. రోజుకు ఒకటి రండు పండు చొప్పున తింటే.. మంచి ఫలితాలు ఉంచాయట. ఈరోజు మనం ఈ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..అతిగా తింటే వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం.

ఎండిన అంజీర పండ్లను ఉడకబెట్టి బాగా రుబ్బుకుని దానిని గొంతు వాపు ఉన్న చోట పెట్టుకుంటే గొంతు వాపు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఎండిన అంజీర పండ్లను వేడి పాలలో ఉడకబెట్టి ఉదయాన్నే తగడం ద్వారా మలబద్దకం సమస్య తీరుతుందట.

తాజా అంజీర పండ్లను తిన్న తరువాత ఒక గ్లాసుడు పాలు తాగడం ద్వారా శరీరం ఉత్తేజితం అవుతుంది. సంతాన లేమి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీర్యం వద్ధి చెందడం, స్త్రీలో అండోత్పత్తి సంబంధమైన సమస్యలను సైతం ఇది దూరం చేస్తుంది.

అంజీర పండ్లు తినడం వల్ల కడుపు ఉబ్బసం కూడా తగ్గుతుంది.

క్షయవ్యాధిని నివారించడానికి, టిబి ప్రభావాన్ని తగ్గించడానికి తాజా అంజీర పండ్లు చక్కగా ఉపయోగపడతాయి.

ల్యూకోరోయాతో బాధపడే వారికి అంజీర పండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.

కడుపు నొప్పితో బాధపడేవారు, జ్వరంతో బాధపడేవారు అంజీర పండ్లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అన్నికంటే ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు చక్కటి ఔషధంగా పని చేస్తాయి.

అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయికదా అని వీటిని ఎక్కువ తిన్నారంటే ప్రమాదమేనట..వీటిని మితంగానే తీసుకోవాలి. అతికి తింటే అనేక రోగాల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా అంజీర్ పండ్ల‌ను ప‌రిమితికి మించి తింటే క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, గుండెల్లో ప‌ట్టేసిన‌ట్టు అయిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు తలెత్తుతాయి.అలాగే ఆడవారు నెలస‌రి స‌మ‌యంలో అంజీర్ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపునొప్పి ఇంకా పెరిగే అవ‌కాశం ఉంటుంది. అధిక ర‌క్త స్రావానికి కూడా దారి తీస్తుంది.

అంజీర్ పండ్ల‌లో ఆక్సలేట్ ఎక్కువ‌గా ఉండటం వల్ల ఈ పండ్ల‌ను ఓవ‌ర్‌గా తినేస్తే ఆక్స‌లేట్ శరీరంలోకి కాల్షియంను గ్రహించేస్తుంది. దాంతో కాల్షియం లోపం ఏర్ప‌డి..ఎముక‌లు, దంతాలు బ‌ల‌హీన ప‌డిపోతాయి. కాలేయ ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఏమైనా కాలేయ స‌మ‌స్య‌లు ఉంటే అవి ఇంకా తీవ్ర త‌రంగా మార‌తాయి. కాబట్టి రోజుకి ఒకటి లేదా రెండు చొప్పున మాత్రమే తినాలి. అది కూడా పైన చెప్పిన సమస్యలు ఉంటేనే రోజు తినండి..లేదంటే అప్పుడప్పుడు తింటే చాలు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news