సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో తులసి మొక్కలు పెంచుతారు. ఇది కేవలం ఆధ్యాత్మికం గానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యం లో కూడా తులసి ఆకుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. తులసి ఆకు తో ఎన్నో ప్రయోజనాలు మనకి వస్తాయి. అయితే దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి.
తులసి ఆకుల్ని కడిగి శుభ్రం చేసి నీడ లో ఆరబెట్టి పొడి చేసి దానిలో తేనె కానీ పెరుగు కానీ కలిపి తీసుకుంటే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణ సమస్యలని కూడా ఇది పోగొడుతోంది. జీర్ణశక్తి మెరుగు పడటానికి దీన్ని రోజుకి మూడు సార్లు తీసుకోండి. ప్రతి రోజు 5 నుండి 25 గ్రాములు నల్ల తులసి రసాన్ని తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.
చిన్న పిల్లలకి వాంతులు వచ్చినప్పుడు కొద్దిగా తులసి విత్తనాలను తీసుకుని వాటిలో పెరుగు లేదా తేనెని కలిపి ఇస్తే వాంతులు తగ్గిపోతాయి. తులసి ఆకులు తీసుకోవడం వలన గ్యాస్ ట్రబుల్ నుండి కూడా బయట పడేలా చేస్తాయి. నల్ల తులసి రసాన్ని మిరియాల పొడి లో వేసి ఆ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యి తో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోతాయి. చూసారా ఎన్ని ప్రయోజనలో..! మరి ఈ సమస్యల నుండి ఈ సులువైన పద్ధతులని అనుసరించి వీటి నుండి బయట పడిపోండి.