మజ్జిగ వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..?

-

ఆరోగ్యమే అన్నింటి కంటే ప్రధమం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. పాల పదార్థాల తో మన ఆరోగ్యానికి చాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మజ్జిగ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అయితే మామూలు సమయం లో కంటే కూడా దీన్ని పరగడుపున తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయని అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి.

ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పుడు మజ్జిగను ఎక్కువగా తాగాలి. ఒంటి లో ఉండే వేడి తగ్గడానికి మజ్జిగ దివ్యౌషధంలా పని చేస్తుంది. అలానే అధిక బరువు తో ఉండేవారు మజ్జిగ లో కాస్త కరివేపాకు, మిరియాలు, వేసుకుని తాగితే కొవ్వు స్థాయిని తగ్గించుకోవచ్చు. మజ్జిగ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ను నియంత్రిస్తుంది. మజ్జిగలో విటమిన్ బి, కాల్షియం, పొటాషియం ఉంటాయి. అందు వల్ల శరీరానికి బలం వస్తుంది. ఇది ఇలా ఉండగా మజ్జిగ వలన జుట్టుకి ,చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది గుర్తుంచుకోండి. కురులకు మజ్జిగను పట్టించి ఒక అరగంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు ఎంతో మృదువుగా తయారవుతుంది. క్యాలరీస్, ఫ్యాట్ లేకుండా శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ ని మజ్జిగ అందిస్తుంది .ఆకలిని తీరుస్తుంది.

డైట్‌ చేసేవారు ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసు మజ్జిగ తాగితే కావాల్సిన శక్తి అందుతుంది. అలానే నీరసించి పోకుండా బరువు తగ్గాలంటే మజ్జిగ మంచి ఉపాయం. బింజ్-ఈటింగ్ వైపు మనసు పోకుండా అదుపు చేస్తుంది . చర్మ సమస్యలు నుండి దూరంగా ఉండాలంటే మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట పాటు ఆరనిచ్చి ఆ తరువాత స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చూసారా మజ్జిగ వల్ల ఎన్ని ప్రయోజనాలో మరి ఫాలో అయిపోండి.

Read more RELATED
Recommended to you

Latest news