కల్లుప్పు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా…?

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా మనం ఎక్కువగా సాల్ట్ ను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఆ సాల్ట్ ను ఉపయోగించడం వల్ల ముప్పు తప్ప మరి ఏమి ప్రయోజనాలు లేవు. కాస్తోకూస్తో కల్లుప్పు ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దీనినే రాక్ సాల్ట్ అని కూడా అంటారు. ఆయుర్వేదం వైద్యం లో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. కల్లుప్పు లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వస్తే… కల్లుప్పు తీసుకోవడం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

అలానే గాయపడ్డ కండరాలు మళ్ళీ కోల్పోవడానికి కూడా ఇది ఉపయోగ పడుతుంది. అలాగే ఇది మంచి యాంటీబయటిక్ గా కూడా పని చేస్తుంది. గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కలిగితే కల్లుప్పుని తీసుకుని వెచ్చని నీటి లో వేసి పుక్కిలిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలి పోతుంటే షాంపూ లో కొంచెం కల్లుప్పు కలిపి స్నానం చేయడం వల్ల వెంట్రుకలు చక్కగా శుభ్రపడతాయి. అలానే చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

కల్లుప్పు ఆహారం లో ఉపయోగించడం వల్ల నిద్ర బాగా పట్టి నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది. శరీర జీవక్రియ మెరుగు పరచడానికి కూడా ఇది పని చేస్తుంది. ఆహారం కూడా త్వరగా జీర్ణం అయిపోతుంది. కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది శరీరం లో బ్యాక్టీరియాను తొలగించడానికి కూడా కల్లుప్పు బాగా మేలు చేస్తుంది. కాంతివంతమైన చర్మం కోసం బకెట్ నీళ్ళ లో కాస్త రాతి ఉప్పును కలిపి స్నానం చేస్తే చర్మం పై ఉన్న మలినాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...