బొప్పాయి తినండి.. బరువు తగ్గి అందంగా తయారవండి..!

-

బొప్పాయి.. ఈ పండు గురించి ఎవరికీ తెలియనిది కాదు. ఊళ్లలో ప్రతి ఇంట్లో బొప్పాయి చెట్లు ఉంటాయి. చాలా చోట్ల ఎవరూ పెట్టకున్నా.. విత్తనాలు పడి అవే మొలకెత్తుతుంటాయి. అందరికీ అందుబాటులో ఉండే బొప్పాయిలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో తెలుసా? దీన్ని ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్స్ అని ఎందుకు అంటారో… బొప్పాయి తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం పదండి.

బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ కే ఎక్కువ శాతం ఉంటుంది. ఖనిజాలు, కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, పీచు పదార్థాలు, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.

జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు బొప్పాయిని తమ ఆహారంలో భాగంగా చేసుకోండి. అల్సర్ సమస్యలు ఉన్నవాళ్లు కూడా బొప్పాయిని రోజూ తినాలి. దీనిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్.. మలబద్దకాన్ని నివారిస్తుంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా?

బరువు తగ్గాలని అనుకునే వాళ్లకు బొప్పాయి ఈజ్ ద బెస్ట్. దీంట్లో ఉండే పీచు వల్ల తొందరగా ఆకలి కాదు. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అందుకే బొప్పాయిని రోజూ తింటుంటే.. బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

చర్మం తేజోవంతంగా మారడానికి కూడా బొప్పాయి ఎంతో ఉపయోగపడుతుంది. బొప్పాయి గుజ్జును చర్మంపై రుద్దడం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది. మొటిమలు కూడా తగ్గుతాయి.

రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు కంటి చూపు తగ్గకుండా బొప్పాయి కాపాడుతుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ల వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎటువంటి ఫ్లూలు సోకకుండా కూడా బొప్పాయి కాపాడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news