రాష్ట్రంలోని అన్నదాతలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కీలక పథకం.. రేపటి నుంచి రాష్ట్రంలో అమలు కానుంది. దాదాపు 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ఈ పథకం ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్ర కారం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. వైసీపీ ప్రభు త్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 13,500 చొప్పున భరోసా లభించనుంది. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఇప్పటికే పూర్తయిపోయింది.
మంగళవారం నెల్లూరులోని సర్వేప ల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ కూడా రైతులకు ఇంత భారీ స్తాయిలో మేలు చేసిన పరిస్థితి మన కు రాష్ట్రంలో ఎక్కడా కనిపించదు. వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో పార్టీ అధినేత జగన్.. ప్రజాసంకల్ప యాత్ర చేసిన సమయంలో ఆయన రైతుల దుస్థితిని గమనించారు.
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఒక్క రైతుకు మేలు చేకూరుస్తానని చెప్పారు. వాస్తవానికి ఈ పథకాన్ని జగన్ ప్రకటించిన మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రారంభించాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో నెలకొన్న కరువు, వరదల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ఈ పథకాన్ని ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణం గా ఇప్పటికే జిల్లాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగన్ ప్రభుత్వం.. అంతే స్థాయిలో ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని చూస్తోంది. కేంద్రం ఇచ్చే కిసాన్ యోజన నగదు రూ.6000లకు తోడు జగన్ రు. 7500 కలుపుకొని రైతులకు రూ. 13500 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేలా ఇప్పటికే పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఇది సక్సెస్ అయితే, రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం అమలు చేసిన తొలి సీఎంగా జగన్ రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.