నోబెల్ కు ఎంపికైన ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ

-

ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు ఎంపికయ్యాడు. 2019 ఏడాదికి గాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారం అందుకోనున్నాడు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరిద్దరే కాకుండా మైకేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం వారు చేసిన కృషికి గాను ఈ బహుమతి ప్రకటించినట్లు నోబెల్ కమిటీ ట్వీట్ చేసింది.

ప్రపంచంలో పేదరికాన్ని తగ్గించేందుకు గత ఇరవయ్యేళ్లలో జరిగిన కృషిలో వీరు ముగ్గురు కీలక పాత్ర పోషించారని కమిటీ తెలిపింది. ప్రపంచ పేదరికాన్ని కనిష్ట స్థాయికి తగ్గించే అంశంలో ఈ త్రయం పరిశోధనాత్మక దృక్పథంతో పలు సిద్ధాంతాలకు రూపకల్పన చేసింది. ఇక వీరి కృషికి గుర్తింపుగా నోబెల్ పురస్కారం వరించింది.

Read more RELATED
Recommended to you

Latest news