సాధారణంగా గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు తీసుకోవడం మనకి తెలుసు. అయితే కేవలం వాళ్లకే కాదు. అందరికీ కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దీన్ని తీసుకోవడం వల్ల చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చు. పాల లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. దీనిలో మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది. కనుక ఇది ప్రశాంతతను ఇస్తుంది.
నిద్రపోయే ముందు కాస్త గోరు వెచ్చని పాల లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తాగితే నిద్రలేమి సమస్య తొలగిపోయి. ప్రశాంతంగా ఉండొచ్చు. అలానే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మహిళలకి రుతుక్రమం సమయం లో తిమ్మిర్లు సహజంగా వస్తూ ఉంటాయి. కుంకుమ పువ్వు వాటిని పోగొడుతుంది.
గుండె ఆరోగ్యానికి కూడా కుంకుమ పువ్వు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అంతే కాదు ఇది కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గడానికి కుంకుమ పువ్వు చాలా మేలు చేస్తుంది. అలానే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాదు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల రక్త పోటును నియంత్రిస్తుంది. అలానే జలుబు దగ్గు కూడా తగ్గుతాయి.