వేపాకు సర్వరోగ నివారిణి. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చేదుగా ఉన్న ఈ వేప మంచి ఔషధంలా పని చేస్తుంది. ఉదయాన్నే వేపాకును తినాలి అంటే చాలా కష్టం బాబోయ్ అని అనుకుంటున్నారా…? కానీ అనేక సమస్యలని యిట్టె పోగొట్టేస్తుంది. ఈ పద్ధతులని అనుసరిస్తే మీరే వావ్ అంటారు.
ఇక కలిగే లాభాల విషయం లోకి వస్తే… పరగడుపునే వేపాకులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చర్మం మీద ఏదైనా గాయాలు, పుండ్లు, సెప్టిక్ లాంటివి అయినప్పుడు వేప రసాన్ని రాయడం వల్ల త్వరగా మానుతాయి. ఉదయాన్నే వేప పుల్లల తో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు శుభ్రం అవడమే కాకుండా, చిగుళ్ళు కూడా గట్టిపడతాయి. నోటి నుంచి దుర్వాసన రావడాన్ని అరికడుతుంది. ఈ వేపాకులో 50 జాతులకు పైగా రకాలు ఉన్నాయి. అంతే కాకుండా గత నాలుగు వేల సంవత్సరాల నుంచి వేపాకును ఔషధంగా వాడుతున్నారు.
ముఖం పైన వచ్చే మొటిమలు కూడా తగ్గించడానికి ఎంత గానో ఉపకరిస్తుంది. గజ్జి, ఆటలమ్మ లాంటి వ్యాధుల నుండి కూడా ఇది బయట పడేస్తుంది. వేపాకుల చూర్ణానికి , పసుపు, ఉప్పు కలిపి శరీరమంతటా మర్దనా చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే ఉపసమనం కలుగుతుంది. ప్రేగులకు ఏదైనా పుండ్లు అయినప్పుడు ఈ వేపాకు రసం మంచి ఔషధంలా పనిచేస్తుంది. వేపాకులను చూర్ణాన్ని చిన్న గుళికలుగా చేసుకొని రోజూ పరగడుపున తినడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు దరిచేరవు. చూసారా ఎన్ని ప్రయోజనాలో..! మరి రోజు వేపాకు ఏదో ఒక రూపంలో తీసుకోండి. సమస్యల నుండి వేగంగా బయట పడండి.