కివి పండు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

-

వైద్యులు, శాస్త్రవేత్తలు పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా కివి పండ్లు తినమని సలహాలు ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఎందుకంటే ఈ పండ్లలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు మనల్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఈ పండు తియ్యగా, పుల్లగా ఉంటుంది. అందుకే మనలో చాలామంది కూడా దీన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కివీ అనేక రకాల తీవ్రమైన వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇప్పుడు ఈ పండు యొక్క ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.ఈ పండులో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, పాలీఫెనాల్స్ ఎంతో పుష్కలంగా లభిస్తాయి. ఇంకా అలాగే కివిలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే బరువు ఈజీగా తగ్గాలనుకునే వారికి ఈ పండు వరం లాంటిది. ఈ పండుని బ్రేక్ ఫాస్ట్ తరువాత తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.దీన్ని ప్రతి రోజూ తింటే గుండె చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.

ఎందుకంటే ఇందులో ఉండే పీచు, పొటాషియం చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి ధమనులను బలోపేతం చేస్తాయి. మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు 2-3 కివీస్ తింటే మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.ఇంకా అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు రోజుకు ఒక కివీని తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే కివిలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.మన కంటి చూపును మెరుగుపరచడానికి కివి చాలా ఉపయోగపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.ప్రతి రోజూ డైట్ లో కివీని చేర్చుకుంటే చూపు బాగా మెరుగుపడుతుంది.అలాగే డెంగ్యూ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఇంకా త్వరగా కోలుకోవడానికి వైద్యులు తరచుగా కివీస్ తినాలని సిఫార్సు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news