రోజులో 8 గంటలు కూర్చునే పనిచేస్తున్నారా? ఈ ప్రమాదాలు ఖాయం!

-

పూర్వకాలంలో శారీరక శ్రమ ఉద్యోగాలు ఎక్కువగా ఉండడంతో వారి శరీరంలోని క్యాలరీలు కరిగి ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడలా కాదు. కూర్చుని చేసే ఉద్యోగం. తినడం, తాగడం, పని మూడు పనులు కూర్చునే చేయాలి. ఇక తిన్నది ఎక్కుడ అరుగుతుంది. 8 గంటలు నిర్వరామంగా కంప్యూటర్‌ ముందు కూర్చోవడం వల్ల ఐదేండ్లలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అవి కూడా దుష్పరిణామాలే. అవేంటో తెలుసుకుందాం.

వెన్నెముక :
సాధారణంగా వెన్నెముక ఎస్‌ ఆకారంలో ఉంటుంది. రోజులో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నెముక కాస్త సి షేప్‌కు మారుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పొట్ట, ఛాతి దగ్గర ఉండే కండరాలు వీక్‌ అవడంతో ఆ భాగంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగదు. అంతేకాదు దీంతోపాటు కంటిచూపు తగ్గుతుంది. తలనొప్పి కూడా ఎక్కువగా వస్తుంది.

గుండె :
శారీరక పనులు చేసే వారికన్నా, కూర్చుని పనిచేసే వారిలో 54 శాతం మందికి గుండెపోటు వస్తుందని పరిశోధనలో తేలింది. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల రక్తప్రసరణ జరుగదు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది. దీంతో హార్ట్‌ఎటాక్‌లు వస్తాయి.


వెరికోస్‌ వీన్స్‌ :
చాలామంది కూర్చున్నప్పుడు కాళ్లమీదికాళ్లు వేసుకొని కూర్చుంటారు. అలా కూర్చోవడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డుగట్టుకు పోతుంది. దీంతో ఆయా ప్రదేశాల్లో రక్తనాళాల్లో రక్త సరఫరా సరిగ్గా జరుగక అక్కడ నాళాలు వాపులకు లోనవుతాయి. ఇదిగాని ఎక్కువైతే ఆ వాపులు బయటకు కనిపిస్తాయి. దీన్నే వెరికోస్‌ వీన్స్‌ అంటారు. సాధారణ ఈ సమస్య కూడా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికే వస్తుంది.

స్థూలకాయం :
శారీరక శ్రమ లేకపోవడం, ఏసీల్లో పనిచేయడం, ఆకలి వేయకున్నా ఏదో ఒకటి లాగించేయడం, నిద్రలేమి.. వంటి కారణాలు తోడైతే స్థూలకాయం సమస్య మరింత పెరుగుతుంది. ప్రధానంగా కూర్చుని ఉద్యోగం చేసేవారికి ఎక్కువగా వస్తుందని చెప్పొచ్చు.

కండరాలు, ఎముకలు :
నిత్య కూర్చుని ఉద్యోగం చేసేవారిలో కండరాలు, ఎముకలు త్వరగా బలహీనంగా మారిపోతాయి. దీంతో వారిలో ఆస్థియోపోరోసిన్‌ సమస్య త్వరగా వస్తుంట. అలా అని అధ్యయనాలే చెబుతున్నాయి.

జీర్ణవ్యవస్థ :
ఎక్కువసేపు కర్చోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో రక్తంలో గ్లూకోజ్‌ అధికంగా పేరుకుపోయి అది టైప్‌ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది.

వయసు మీద పడడం :
శారీరక శ్రమ లేకుండా ఉద్యోగం చేసేవారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయని పలు పరిశోధనల్లో చెబుతున్నారు. అలాంటి వారు త్వరగా వృద్ధాప్యంలోకి వచ్చేస్తారిన సైంటిస్టులు అంటున్నారు.

ఇలా చేయాలి..
నిత్య కూర్చుని పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని తెలుసుకున్నాం. వీటి బారిన పడకుండా ఉండడానికి ఏం చేయాలంటే..

1. ఆఫీసుల్లో మీటింగ్స్‌ పెడితే నిలబడి ఉండడం అలవాటు చేసుకోవాలి.
2. రాత్రిపూట బెడ్‌ ఎక్కగానే మొబైల్‌, ట్యాబ్లెట్‌ పీసీలు తదితర గ్యాడ్జెట్లకు దూరంగా ఉండండి.
3. మధ్యాహ్న భోజనం చేయగానే వెంటనే కూర్చుని పనిలోకి దిగకుండా కొంచెం సేపు వాకింగ్‌ చేయండి.
4. ఆఫీసులో నిత్య కూర్చుని పనిచేయకుండా గంటకు ఒకసారి లైచీ ఐదు నిమిషాలపాటు నడువండి.
5. ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. చక్కని ఆరోగ్యానికి బాటలు వేస్తాయి.
ఈ సూచనలు పాటించడం వల్ల ఆనారోగ్యాల బారి నుంచి తప్పించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news