శరీరంలో ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం కంపల్సరీ. శరీరంలో క్యాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా తయారవుతాయి. అయితే మనం తీసుకునే ఆహారాల్లో క్యాల్షియం ఉండేలా కచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ మీ బాడీలో క్యాల్షియం లోపం ఉంటే అనేక అనారోగ్యాలు వస్తాయి.
ప్రస్తుతం క్యాల్షియం లోపించడం వల్ల శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
కండరాలు పట్టేయడం:
శరీరంలో క్యాల్షియం తగ్గిపోతే ప్రధానంగా కండరాలు పట్టేయడమనే లక్షణం కనిపిస్తుంది.
ఏదైనా చిన్న పని చేసినా కూడా కాళ్లు చేతుల్లోని కండరాలు పట్టేస్తుంటాయి. ఇలా రెగ్యులర్ గా జరుగుతుంటే మీ బాడీలో క్యాల్షియం లోపం ఉందని అర్థం చేసుకోవాలి.
గోర్లు విరిగిపోవడం:
చేతివేళ్ళ గోర్లు, కాలివేళ్ల చాలా సులభంగా విరిగిపోతుంటే క్యాల్షియం లోపం అని అర్థం చేసుకోవాలి. క్యాల్షియం కావలసినంత ఉంటే గోర్లు బలంగా ఉంటాయి.
ఎముకలు విరగడం:
ఎముకలకు బలాన్ని ఇచ్చేది క్యాల్షియమే కాబట్టి ఎముకలు బలహీనంగా మారిపోయి జరిగిపోతుంటాయి. అంతేకాదు.. చర్మం పొడిబారిపోవడం, వెంట్రుకలు ఎక్కువగా రాలిపోవడం, పళ్ళు పుచ్చిపోవడం, వంటి సమస్యలు కాలుష్యం లోపం వల్ల వస్తాయి.
క్యాల్షియం లోపాన్ని నివారించాలంటే ఏం చేయాలి..?
పై లక్షణాలు కనిపించినట్లయితే వైద్యులను సంప్రదించడం మంచిది. అయితే లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేస్తే క్యాల్షియం స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.
పాలు, పాల పదార్థాలను రోజువారి ఆహారంలో తీసుకోవడం. పాలకూర, బాదం వంటి వాటిని డైట్ లో చేర్చుకోవడం మంచిది.
అంతేకాదు.. ఒక్కోసారి క్యాల్షియం సప్లిమెంట్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎంత డోసేజ్ లో సప్లిమెంట్లు తీసుకోవాలనేది తెలియాలి. దానికోసం వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది.