బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వీటిని మీరు అనుసరించాల్సిందే..!

వివిధ కారణాల వల్ల చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ అంత సులభంగా ఎవరు కూడా బరువు తగ్గలేరు. కానీ అనుదినం ఇలా అనుసరిస్తూ ఈ చిట్కాలని క్రమంగా పాటిస్తే మాత్రం సులువుగా మీరు వెయిట్ లాస్ అవ్వగలరు. అయితే దీని కోసం మీరు ముందుగా ఆహారపు అలవాట్లపై నియంత్రణ తెచ్చుకోవాలి. అంతే కాకుండా రెగ్యులర్ గా వర్కవుట్ చేయాలి. ఇలా ప్రతీది కూడా వెయిట్ లాస్ పై ప్రభావం చూపుతుంది ఇది మీరు గమనించి తీరాలి. ఇది ఇలా ఉంటే బరువుగా ఉన్న వాళ్ళల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతూ ఉండడం సహజం. మరి బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గుతుంది అని ఆలోచిస్తున్నారా…? అయితే పూర్తిగా చూసేయండి.

బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవాలంటే..? పరగడుపునే గ్లాసుడు నీళ్లు తాగడం బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి తోడ్పడే ముఖ్యమైన అలవాటు. కాబట్టి క్రమం తప్పకుండ ప్రతీ రోజు గ్లాసుడు నీళ్లు తాగడం మరచిపోకండి. అలానే బెల్లీ ఫ్యాట్ ను కరిగించాలంటే తప్పక మీ గట్ హెల్త్ బాగుండాలి. దీనికి మీరు ప్రోబయాటిక్ ఫుడ్స్ పై దృష్టి పెట్టాలి. ఈ ఆహార పదార్ధాలు డైజెస్టివ్ సిస్టమ్ ను మెరుగుపరుస్తాయి మరియు బెల్లీ ఏరియా వద్ద ఫ్యాట్ ను కరిగిస్తాయి.

బ్రేక్ ఫాస్ట్ ను ఎట్టి పరిస్థితులలోనూ స్కిప్ చేయకండి. వెయిట్ లాస్ కోసం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం మంచి ఆప్షన్ కాదు. కాబట్టి తప్పక బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోండి. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలన్నది మీ దృఢ సంకల్పమైతే మీరు కాఫీ అలాగే టీ బదులు గ్రీన్ టీపై దృష్టి పెట్టాలి. అలానే బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందు చిన్నపాటి వర్కవుట్ సెషన్ కు సమయాన్ని కేటాయించండి. ఇది బెల్లీ వద్ద పేరుకుని ఉన్న ఫ్యాట్స్ ను కరిగించడానికి సహాయం చేస్తుంది.