Heart Valve Disease: మనకి ఉన్న ముఖ్య అవయవాల్లో హృదయం చాలా ముఖ్యమైనది. అన్ని భాగాలకు గుండె రక్తాన్ని పంపిణీ చేస్తుంది. గుండెలో మొత్తం నాలుగు చేంబర్స్ ఉంటాయి. తెరుచుకుంటూ క్లోజ్ అవుతూ హార్ట్ చాంబర్స్ లో రక్తాన్ని పంపిస్తూ ఉంటాయి.
హార్ట్ వాల్వ్ సమస్యలో రకాలు:
వాల్వ్స్‌కి ప్రధానంగా రెండు సమస్యలు రావడం జరుగుతుంది. అవే స్టెనోసిస్, రెగర్జిటేషన్. ఈ సమస్యల కారణంగా వాల్వ్స్ సరిగ్గా వర్క్ అవ్వవు. రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం, వాల్వ్ తెరచుకోకపోవడాన్ని స్టెనోసిస్ అంటారు. పూర్తిగా మూసి వేయలేకుండా వెనుకకి లీక్ అయినట్టు అయితే దాన్ని రెగర్జిటషన్ అంటారు.
ఎలాంటి లక్షణాలు కనపడతాయి..?
ఈ సమస్య వస్తే మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. రాను రాను త్వరగా అలసట రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బలహీనంగా ఉండడం, గుండె దడ కలుగుతాయి.
ఈ సమస్యను ఎలా నిర్దారిస్తారు..?
స్టెతస్కోప్‌తో రోగిని పరీక్షించడం ద్వారా డాక్టర్ నిర్ధారణ చేస్తారు. ఎక్స్-రే, ECG & ఎకోకార్డియోగ్రఫీతో ద్వారా కూడా అంచనా వేస్తారు.
ఎలాంటి మందులు ఇస్తారు..?
ఈ సమస్య ఉంటె రోగికి మందులు ఇస్తారు. దాంతిహో లక్షణాలను కొంతవరకు తగ్గిస్తాయి. అయినప్పటికీ, కొన్ని సంవత్సరాల తర్వాత శస్త్రచికిత్స అవసరమవుతుంది. కొంతమంది మిట్రల్ స్టెనోసిస్ రోగులలో, బెలూన్ మిట్రల్ వాల్వెటమీ చికిత్స కూడా బాగా పనిచేస్తుంది.
హార్ట్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ సర్జరీ:
ఈ సర్జరీ అనేది ఓపెన్-హార్ట్ సర్జరీ. దీనిలో రోగి గుండె నుండి వ్యాధిగ్రస్తులైన వాల్వ్‌ను తొలగించి, దాని స్థానంలో కృత్రిమ గుండె కవాటాన్ని ఫిక్స్ చేస్తారు. మెకానికల్ లేదా మెటాలిక్ వాల్వ్‌లు, బయో ప్రొస్తెటిక్ వాల్వ్ ఉంటాయి. మెకానికల్ కవాటాలు చిన్న వయస్సు వాళ్లకు పెడతారు. 60-65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న రోగులలో కణజాల కవాటాలు ఫిక్స్ చేస్తారు. కణజాల కవాటాలు 15 నుండి 20 సంవత్సరాల జీవితకాలం కలిగి ఉంటాయి.