ప్రతి సంవత్సరం చాలా మంది మలేరియా బారిన పడుతూ ఉంటారు. మలేరియా బారిన పడ్డారంటే దాని నుంచి కోలుకోవడం కష్టమే. కానీ మలేరియా సమస్య నుండి బయట పడడానికి అవుతుంది. ప్రతి ఏడాది కూడా 25 ఏప్రిల్ న మలేరియా పై అవగాహన కల్పించడం కోసం.. మలేరియా లేకుండా చేయడం కోసం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు.
దీని ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే మలేరియా అనేది పారాసైట్స్ వలన వస్తుంది. దోమలు కుట్టడం వలన ఈ సమస్య మనకి వస్తుందన్న సంగతి తెలిసిందే అయితే మలేరియా కి సంబంధించిన దోమలు కుట్టిన తర్వాత పది నుండి పదిహేను రోజులకి లక్షణాలు కనపడతాయి.
నిజానికి మలేరియా వలన చాలా ఇబ్బందులు మనకి కలుగుతూ ఉంటాయి. అయితే మలేరియా బారిన పడకుండా ఉండాలంటే ఈ మూడు ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది. దీంతో మలేరియా నుంచి మనం ఫైట్ చేయడానికి అవుతుంది. అయితే మరి మలేరియా బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం.
వేప:
వేప లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వేపాకులు నమలడం వల్ల లేదంటే నీళ్ళలో వేసి వాటిని మరిగించి తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు. వేపాకులలో చక్కటి మెడిసినల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచడానికి, వ్యాధికి కారణమైన వాటి నుంచి బయట పడేయడానికి సహాయ పడతాయి.
ధనియాలు:
ధనియాల నీళ్లు కానీ కొత్తిమీర ఆకులు కానీ తీసుకోవడం వల్ల మలేరియా బారిన పడకుండా ఉండవచ్చు.
తిప్పతీగ:
తిప్పతీగ ని ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటారు దీని వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. మలేరియా నుంచి బయటపడడానికి తిప్పతీగ కూడా సహాయం చేస్తుంది. కాబట్టి తిప్పతీగను కూడా మీరు తీసుకోండి. ఇలా వీటి వల్ల మలేరియా సమస్య నుండి బయట పడడానికి అవుతుంది.