రైతులకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు రైతులు తమ కేవైసీని అప్‌లోడ్ చేసుకోకపోతే.. మరోసారి చేసుకునేందుకు అవకాశం కల్పిచింది. అయితే ఈ ఆప్షన్‌ను కొన్ని రోజుల నుంచి తొలగించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి రైతులకు ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే రైతులు ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. ఇంట్లోనే కూర్చోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ది పొందుతున్న రైతులు అందరూ తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు మే 31 వరకు ఉంది. ఈలోగా రైతులు కేవైసీ చేసుకోకపోతే కేంద్ర నుంచి వచ్చే డబ్బులు మిస్ చేసుకుంటారు.
ఈకేవైసీ చేయండిలా..
ఈకేవైసీ చేయాలనుకునే రైతులు ముందుగా https://www.pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ కుడివైపున ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందులో పైనే ఈకేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో రైతులు ఆధార్ నమోదు చేసిన తర్వాత సెర్చ్ చేయాలి. అక్కడ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ పూర్తవుతుంది.