అరే.. ఈ 10 ఫుడ్ ఐటమ్స్ వెజ్ అనుకుని తింటున్నారా..! అయితే బోల్తా పడినట్లే

-

బేసిక్ గా చాలామంది బతకడం కోసం తింటారు..మరికొందరు ఉన్నది ఒక్కటే జీవితం అన్నీ రకాల ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయాలి అని కాన్సప్ట్ తో తింటుంటారు. వీళ్లలో వెజ్ లవర్స్, నాన్ వెజ్ లవర్స్ అని ఇద్దరు ఉంటారు. ఇంకా కొందరు కొన్ని వారాల్లో నాన్ వెజ్ తినకూడని అనుకునే వాళ్లు ఉంటారు. అలా రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు వెజ్ అనుకునే కొన్ని ఐటమ్స్ చెప్తాం.. అయితే మీ అందరికి తెలియని విషయం మీరు వెజ్ అనుకుని తినే కొన్ని ఐటమ్స్ నాన్ వెజ్ అని. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1.ఛీజ్

చీజ్..పిజ్జా విత్ ఎక్ట్సా చీజ్..సూపర్ టేస్త్..అసులు చీజ్ లేకుండా మనకి చాలా ఫాస్ట్ ఫుడ్స్ ఉండవు. చీజ్ ని ఇష్టపడని వారంచూ ఎవరూఉంటారు. చాలా రేర్.. కానీ ఇందులో ఏమి నాన్ వెజ్ ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? ఇందులో “రెనెట్స్” అనే పదార్ధం ఉంటుంది. ఇది జంతువుల చిన్న ప్రేవుల నుంచి తయారయ్యే ఒక ఎంజైమ్. చీజ్ పాకెట్స్ పై కూడా ఇది మెన్షన్ చేయరు. కాబట్టి ఇది చాలా మందికి తెలిసే అవకాశం లేదు.

2. ఆయిల్

ఆయిల్ లేకుండా ఏ వంట తయారుచేయలేం.. దాదాపు అన్ని ఆయిల్ కంపెనీ లు తమ ఆయిల్ హార్ట్-ఫ్రెండ్లీ అంటూ తెగ యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఒమేగా-3 ఆసిడ్స్ ఉన్న ఆయిల్స్ ను ఫిష్ ఆయిల్స్ నుంచి తయారు చేస్తారు. అలాగే.. కొన్ని ఆయిల్స్ తయారీలో లానోలిన్ నుంచి తీయబడిన డి విటమిన్ ని కలుపుతారు. ఈ లానోలిన్ అనే పదార్ధం గొర్రెల నుంచి వస్తుందట.

3. నాన్స్

చాలామందికి నాన్స్ అంటే బాగా ఇష్టం. బటర్ నాన్ విత్ పన్నీర్ కర్రీ సూపర్ కాంబినేషన్..నాన్ వెజ్ తినేవాళ్లకైతే..నాన్స్ తో పాటు చికెన్ కర్రీ ఆర్డర్ ఇస్తారు. కానీ మీకు నాన్స్ కూడా నాన్ వెజ్ అని తెలియదు కదా..కొన్ని నాన్ లను ప్రిపేర్ చేసేప్పుడు పిండిలో ఎగ్ ను కలుపుతారు. సాఫ్ట్ నెస్ కోసం.

4. సలాడ్

ఇంకా సలాడ్ ని మంచి స్నాక్ ఐటమ్ గా తీసుకుంటారు. సలాడ్ లో వెజిటబుల్స్ మాత్రమే కదా.. ఇది ఎందుకు వెజ్ ఫుడ్ కాదు అనుకుంటున్నారా? కొన్ని రకాల సలాడ్స్ లో పైన డెకరేట్ చేసే సలాడ్ డ్రెస్సింగ్ లో ఎగ్ ఉంటుంది. ఇది ఆప్షనల్ కాబట్టి.. మీకు కావాలని అనుకుంటే వేసుకోవచ్చు.. లేదంటే ఆర్డర్ చేసినప్పుడు ఇది వాడొద్దని చెప్పాల్సి ఉంటుంది.

5. పంచదార

పంచదార ..మార్నింగ్ లేవగానే చాలామందికి టీ/ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. ఈ షుగర్ క్లియర్ గా, వైట్ క్రిస్టల్స్ లాగ ఉంటుంది కదా.
అసలు నాచురల్ గా తయారు చేయబడ్డ షుగర్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ తరువాత ఇది వైట్ గా అవుతుంది..ఇలా మనం మనం అనుకుంటూ ఉంటాం. ఈ ప్రాసెస్ లో నాచురల్ కార్బన్ ని వినియోగిస్తారు. ఈ నాచురల్ కార్బన్ ఎక్కడనుంచి వస్తుందనుకుంటున్నారు..? అనిమల్ బోన్స్ నుంచి ఈ నాచురల్ కార్బన్ ను సేకరించి షుగర్ తయారీ లో వాడతారు

6. కాండీస్

అట్ట్రాక్టీవ్ గా కనిపించే రెడ్ కాండీస్ ని ఇష్టపడనివారెవరు. కానీ ఈ కాండీస్ ని తయారు చేసే క్రమం లో ఫుడ్ డైస్ వాడతారట. ఈ ఫుడ్ డైస్ కి ఆ కలర్ రావటానికి ఇన్సెక్ట్స్ మరియు ఇతర క్రిమికీటకాల నుంచి రంగు సేకరిస్తారు.

7. బీర్

బీర్..ఇది ఒక బ్యాచ్ కి బాగా ఇష్టమైన డ్రింక్.. వీకెండ్ వచ్చిందంటే చాలా మంది అబ్బాయిలు బీర్ తాగడానికే సిట్టింగ్ వేస్తూ ఉంటారు. కానీ బీర్ తయారు చేసేటపుడు ఇందులో ఇసింగ్లాస్ అనే పదార్ధం వాడతారు. బీర్ గోల్డెన్ కలర్ లో కనిపించడం కోసం దీనిని ఉపయోగిస్తారు. ఫిష్ బ్లాడర్ నే ఇసింగ్లాస్ అని పిలుస్తారు. వైన్ తయారీ లో కూడా దీనిని ఉపయోగిస్తారట.

8. చాకోలెట్స్

చాకొలేట్ కూడా నాన్ వెజ్జా అనుకుంటున్నారా..అవును మరి..ఇందులో కూడా “రెన్నెట్” అనే ఎంజైమ్ ఉంది. ఇది ఆవును వధించిన తరువాత కడుపు నుండి తీస్తారు.

9. చూయింగ్ గమ్

చూయింగ్ గమ్.. వీటిని ఊరికే టైం పాస్ గా తింటూ ఉంటాము. నమిలి పారేయడమే తప్ప తినలేము. ఈ చూయింగ్ గం లో జెలటిన్ ఉంటుంది. సాగే లక్షణం కోసం దీనిని వినియోగిస్తారు. జెలటిన్ చర్మం, లిగమెంట్స్, ఎముకలు, ఆవులు, పందుల లిగమెంట్స్ నుండి తీసుకుంటారు.

10. డోనట్స్

చాలా మంది ఫేవరెట్ స్వీట్ ఫుడ్ డోనట్స్. చూడ్డానికి మంచి కలర్ ఫుల్ గా కనిపిస్తాయ్. చాల మంది వీటిని వెజ్ ఫుడ్ అనే అనుకుంటారు. కానీ కాదు. వీటిలో ఎల్. సిస్టీన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది బాతు ఈకలు, పంది ట్రోటర్లతో తయారు చేస్తారు.

ఇవండి..వెజ్ అనుకుని మీ ఫ్రెండ్స్ ఎవరైనా వీటిని తింటుంటే షేర్ చేసి షాక్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news