సైన‌స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు..!

-

సైనసైటిస్‌ సమస్య ఉన్న వారి బాధ వర్ణనాతీతం. ఎన్ని మందులు వాడినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్సలే లేవు. వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం వేధించే ఈ సమస్యతో కాలం వెళ్లదీస్తున్న వారు చాలా మందే ఉంటారు. అయితే సైన‌స్ స‌మ‌స్య‌కు చింతించాల్సిన ప‌నిలేదు. కింద సూచించిన విధంగా ప‌లు చిట్కాల‌ను పాటిస్తే సైన‌స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఒక పాత్రలో బాగా మరిగిన వేడి నీటిని తీసుకుని అందులో కొంత యూకలిప్టస్ ఆయిల్ లేదా మెంథాల్ వేయాలి. అనంతరం నీటి నుంచి వెలువడే ఆవిరిని పీల్చాలి. ఇలా చేస్తే సైనస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. సైనస్ సమస్య ఉన్న వారు ఎప్పటికప్పుడు నీటిని తాగుతుండాలి. దీంతో శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఫలితంగా సైనస్ సమస్య తొలగిపోతుంది.

3. మసాలాలు, కారం బాగా వేసి వండిన ఆహారాలను తినాలి. కారంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి సైనస్ సమస్యను క్లియర్ చేస్తాయి.

4. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తే మ్యూకస్ కరుగుతుంది. సైనస్ సమస్య నుంచి బయట పడవచ్చు.

5. యాపిల్ సైడర్ వెనిగర్‌లో నాచురల్ క్లీనింగ్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. ఇంకా అనేక లాభాలు యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల కలుగుతాయి. సైనస్ నొప్పులను, లక్షణాలను తగ్గించే గుణం ఇందులో ఉంది. ఒక కప్పు వేడి నీటిలో రెండు, మూడు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి రోజుకు 3 సార్లు తాగాలి. ఇలా చేస్తే ఎక్కువగా ఉన్న మ్యూకస్ కరుగుతుంది. ముక్కు దిబ్బడ పోతుంది. సైనస్ సమస్య తగ్గుతుంది.

6. చికెన్, వెజిటెబుల్స్ వేసి తయారు చేసిన వేడి వేడి సూప్స్‌ను తాగాలి. ఇవి మ్యూకస్‌ను కరిగించి సైనస్ సమస్య నుంచి బయట పడేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news