తిన్న తర్వాత అసౌకర్యంగా అనిపిస్తుందా? విరేచనాలు, మలబద్ధకం, చిరాకు, ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిరి,గ్యాస్ మొదలగు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? ఐతే మీరు జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుండవచ్చు. జీర్ణవ్యవస్థ Digestive systemలు సాధారణమే. కానీ కొన్ని సార్లు ఇవి అసాధారణంగా మారి చికాకు కలిగిస్తుంటాయి. అందుకే ఈ సమస్యల బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. దీనికోసం కొన్ని ఇంటిచిట్కాలని ఇప్పుడే తెలుసుకుందాం.
ఆహారాన్ని సరిగ్గా నమలండి
ఆహారం జీర్ణం అవడానికి అతి ముఖ్యంగా చేయాల్సిన పని, ఆహారాన్ని సరిగ్గా నమలడం. ఆహారాన్ని సరిగ్గా నమిలినపుడు అది జీర్ణాశయ పనిని సులభం చేసి తొందరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అందుకే ఆహారం తినడానికి సమయాన్ని కేటాయించాలి.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు
జీర్ణక్రియలో ఫైబర్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఫైబర్ లోని రెండు రకాలు.. కరిగే ఫైబర్, కరగని ఫైబర్ లని ఆహారంలో భాగం చేసుకోవాలి. జంక్ ఫుడ్ మానేసి కూరగాయలు, పండ్లు, కాయలు, తృణ ధాన్యాలు కాయలు, విత్తనాలు, చిక్కుళ్ళు తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది.
పుష్కలమైన నీళ్ళు
కావాల్సినన్ని నీళ్ళు తాగకపోవడం వల్ల కూడా జీర్ణ సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే పుష్కలమైన నీళ్ళు తాగదం ఉత్తమం. తాజా పండ్ల రసాలు, నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్ళు వంటి పానీయాలతో రోజంతా మీరే హైడ్రేట్ గా ఉండండి.
వ్యాయామం
శారీరక శ్రమ లేకపోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉద్భవిస్తాయి. నడవడం, పరుగెత్తడం, చెమట చిందించడం అలవాటు చేసుకోండి.
ఒత్తిడిని పక్కన పెట్టండి
ఒత్తిడిని తీసి గట్టు మీద పెట్టేయండి. లేదంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవకపోవడానికి కారణాల్లో ఒత్తిడి కూడా ఉంది. అందువల్ల ఒత్తిడి తీసి పక్కన పెట్టేయాలి.