రోజు వారి ఎదురయ్యే అనారోగ్యాలకు ఇంటి చిట్కాలు

-

మనం నిత్యం ఏదో ఒక రకమైన అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటాం. దీనికి గాను తరచూ డాక్టర్ దగ్గరకు వెళ్తాం. అక్కడ ఇచ్చే మందుల వల్ల లేని పోని వ్యాధులకు గురవుతాము. ఇలాంటి వాటి కోసం మన పూర్వీకుల కాలం నుండి ఇంటి చిట్కాలు ను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వాళ్ళ ప్రతి చిన్న సమస్యకు వైద్యుడిని ఆశ్రయించే ఇబ్బంది తప్పుతుంది. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం.

1. మూత్రకోశ వ్యాధులతో బాధపడేవారు ముల్లంగిని ఆకులతో సహా కూర చేసుకుని లేదా మెత్తగా రుబ్బి రసం తాగినా మంచి గుణం కనిపిస్తుంది.

2. వేసవి కాలంలో చాలా మంది శరీరానికి సరిపడా నీరు తాగాక పోవడం వల్ల కిడ్నీ సమస్యలకు గురౌతూ ఉంటారు. వారు రోజు రెండు పూటలా అర చెంచా మెంతులను పెరుగులో నాన బెట్టి తింనడం వల్ల నొప్పి తగ్గుతుంది.

3. కంటి చూపు దెబ్బ తిన్నవారు 10 మి. లీ చొప్పున తెల్ల ఉల్లిపాయ రసం, అల్లం రసం, నిమ్మరసం కలిపి దానికి 3 చెంచాల తేనె కలిపి తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది.

4. నోటిలోని పళ్ళ వెంట ఇన్ఫెక్షన్ కారణంగా రక్తం కారుతూ ఉంటుంది. ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి దంతాలపై రుద్దితే వెంటనే రక్తం కారడం ఆగుతుంది.

5. ఊబకాయం తగ్గటానికి మిరియాలు, శొంఠీ 10 గ్రాముల చొప్పున తీసుకుని రెండు కట్టల పుదీనా తో కలిపి నూరి చిన్న చిన్న గుళికలుగా చేసి నీడలో ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. వీటిని రోజుకి మూడు , మూడు నెలల పాటు వాడితే ప్రయోజనం ఉంటుంది.

6. కాలిన గాయాలకు బాగా పండిన అరటి పండు గుజ్జు రాస్తే మంట తగ్గి త్వరగా గాయం నయమవుతుంది.

7. రాత్రి నిద్రకు ముందు పాదాలను కడిగి తుడిచి కొబ్బరి నూనె రాస్తుంటే ఎంతటి పగిలిన పాదాలు అయినా వారం రోజుల్లో మెత్తబడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news