Heart Attack : చాలామంది రెగ్యులర్ గా కాఫీ ని తాగుతూ ఉంటారు. కాఫీ తీసుకోవడం వల్ల చాలా సమస్యలు తగ్గుతాయి. అయితే అధిక మోతాదులో కాఫీ ని తీసుకోవడం వలన అనేక సమస్యలు కలిగే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం నాలుగు కప్పుల కాఫీ రోజు తీసుకోవడం సురక్షితం కానీ ఎక్కువగా కెఫీన్ తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలు కలగడమే కాకుండా అనేక సమస్యలకి దారి తీస్తాయట. బీపీ పెరగడమే కాదు హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ఇబ్బందులు కలుగుతాయి. అయితే కాఫీ ని తీసుకునేటప్పుడు ఎన్ని కప్పులు తీసుకుంటే సురక్షితం, ఎన్ని కప్పుల వరకు తీసుకుంటే సమస్యలు ఉండవు..? అనే దాని గురించి తెలుసుకుందాం.
రోజుకు ఎన్ని కప్పుల కాఫీని తీసుకోవచ్చు..?
400 మిల్లీగ్రాముల కెఫీన్ రోజుకు తీసుకోవచ్చు. దానికి మించి తీసుకుంటే కచ్చితంగా గుండె సమస్యలు కలుగుతాయి. హైపర్ టెన్షన్ లేదా సాల్ట్ స్ట్రెస్ కలుగుతుంది. 92 మందిని తీసుకుని రీసెర్చ్ చేశారు. అధిక మోతాదులో కాఫీ ని తీసుకోవడం వలన అనేక సమస్యలు కలుగుతున్నట్లు గుర్తించారు. హైబీపీతో పాటుగా గుండె సమస్యలు కలిగినట్లు గుర్తించారు. కాబట్టి లిమిట్ దాటి తీసుకోవడం మంచిది కాదు. హైపర్ టెన్షన్ వలన స్ట్రోక్, డిమెన్షియా, హృదయ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి కూడా కలగొచ్చు. కాబట్టి కాఫీ ని తీసుకునేటప్పుడు నాలుగు నుండి ఐదు కప్పుల వరకు తీసుకోండి. అంతకుమించి తీసుకుంటే మాత్రం ఈ సమస్యలు తప్పవని గుర్తుపెట్టుకోండి.