ఈ పండ్లు కనిపిస్తే అస్సలు వదలకండి..!

-

ప్రకృతి అందించే కొన్ని రకాల పండ్లలో అంతకుమించి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా అదిలాబాద్, విశాఖ ఏజెన్సీ, శ్రీకాకుళం వంటి ప్రాంతాలలో విరివిగా దొరికే పండు ఏది అంటే అది మొర్రి పండ్లు మాత్రమే అడవి ప్రాంతం అధికంగా ఉండే జిల్లాలలో గిరిజన పంటగా దీనిని మనం పరిగణించవచ్చు. అయితే ఇక్కడ మాత్రమే ఈ మొర్రి పండ్లు విరివిగా లభిస్తాయి.. ఈ చెట్లు పొలాల గట్ల ఇరువైపులా కూడా కనిపిస్తాయి.. ఈ కాయలు రుచికి తీయగా పుల్లగా ఉంటాయి. చెట్టునిండా సన్నని ముళ్ళు ఉంటాయి.. వీటిని మొర్రి పండ్ల చెట్టు అని పిలుస్తారు.ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వడలకండి.. వీటిని తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

మొర్రి పండ్లు పిల్లలకు తినిపించడం వల్ల వారి ఎదుగుదల బాగా ఉంటుంది. వారు దృఢంగా, ఆరోగ్యంగా మారతారు.. ఈ కాయలు పచ్చగా ఉన్నప్పుడు పచ్చ రంగులో.. దోరగా ఉన్నప్పుడు ఎరువు రంగులో.. పండినప్పుడు నలుపు రంగులో ఉంటాయి. వీటిని పండించరు కానీ అడవి ప్రాంతాల్లో.. పొలం గట్లపై మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి. వీటిలో రసాయనాలు ఉండవు కాబట్టి వీటిని తినడం వల్ల శరీరానికి అంతకుమించి మేలు జరుగుతుంది.. ఈ మొర్రి పండ్లలో ఒక గింజ మాత్రమే ఉంటుంది. గింజ చుట్టూ పండు ఉంటుంది . దీనిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..

జీర్ణ క్రియను మెరుగుపరిచి బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. సహజ శీతలీకరణగా పనిచేస్తుంది. అతిసారం వంటి సమస్యలకు చికిత్స పొందవచ్చు. అల్సర్లు కూడా దూరం అవుతాయి. రక్తంలో చక్కర స్థాయి నియంత్రించబడుతుంది. ఈ మొర్రి పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి సీజన్లో వచ్చే వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news