ఇవి తినకపోతే పొట్ట రావడం పక్కా!

-

సాధారణంగా బరువు పెరిగితే పొట్ట కూడా వస్తుంది. పొట్టకు, బరువుకు ఇంటర్‌ లింక్‌ ఉంటుంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఒబేసిటీ ఉన్నవారు విటమిన్‌ సీ ( Vitamin c foods ) తగినంత ఉండేలా చేసుకోవాలి.లేకపోతే, బరువు తగ్గరు.

Belly Fat

విటమిన్‌ సీలో యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. రోజూ తగిన పండ్లు, కూరగాయలు తింటే… విటమిన్‌ సీ సరైన మోతాదులో అందుతుది. ఈ విటమిన్‌ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు, రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. ఒబేసిటీని తగ్గించుకోవాలనుకునేవారు విటమిన్‌ సీ  అధికంగా ఉండే పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాదు, విటమిన్‌ సీకి గుండెకు మేలు చేసే గుణం ఉంటుంది. కేన్సర్‌ వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది.

చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా, ఎముకలు ధృడంగా ఉండాలన్నా ఈ విటమిన్‌ అవసరం. మన శరీరంలోని కొవ్వు కణాలు శక్తిని ఉత్పత్తి చేసే.. విటమిన్‌ సీ చేస్తుంది. అందువల్ల కొవ్వు పెరగకుండా ఉంటుంది. ఉసిరి, నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, పచ్చిమిర్చి, టమాటా, జామ, మామిడికాయ, స్ట్రాబెర్రీ, మొలకలు, బంగాళాదుంపలు. తప్పనిసరిగా తినాలి. లేకపోతే, మీరు ఎన్ని ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నా వ్యర్థమవుతుంది. ఈ విటమిన్‌ను మగవాళ్లు రోజూ 90 మిల్లీగ్రాముల, ఆడవారు రోజూ 75 మిల్లీగ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, పెద్దవాళ్లు రోజుకు 2వేల మిల్లీగ్రాములకు మించి విటమిన్‌ సి తీసుకోకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news