ఎక్కువ కేలరీలు బర్న్ కావాలంటే ఈ యోగాసనాలు చేయండి..!

బరువుతగ్గాలని చాలమంది అనుకుంటారు. వాటికోసం ఏవేవో తింటారు, డైట్ అంటారు. మరికొందరు వ్యాయామాలు చేస్తుంటారు. జిమ్స్ లో తెగ కష్టపడతారు. అయితే యోగా కూడా కొందరు ఫాలో అవుతారు. బరువుతగ్గడంలో ముందు చేయాల్సింది..కాలరీలను బర్న్ చేయటం. నడిచినా కూడా కొన్ని కాలరీలు కరుగుతాయి. మనం కొన్ని ఆసనాలు వేయటం ద్వారా కాలరీలను త్వరగా బర్న్ చేసుకోవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ట్రయంగల్‌..

ఈ యోగాసన సమయంలో మీ కాళ్లను వెడల్సుగా, చేతులను నేలకి సమాంతరంగా ఉంచాలి. ఎడమవైపునకు వంగి నేలను వీలైనంత వరకు తాకటానికి ప్రయత్నించాలి. ఈ స్థితిలో 10–15 సెకన్లు ఉండాలి. ఈ యోగా జీర్ణశయాంతర పనితీరును ప్రోత్సహిస్తుంది. బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడాన్ని ఈ ఆసనం తగ్గిస్తుంది. భుజం, కాలు, చేతి కండరాలకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది కొత్త కండరాల కణజాలం నిర్మించడానికి కూడా సహాయపడుతుంది.

చైర్‌..

ఒక వర్టికల్‌ పొజిషన్‌లో నిలబడాలి. ఇప్పుడు కాళ్లను పట్టుకోవాలి. మీ అరచేతులను ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా మీ చేతులను మెల్లగా వంచాలి. కాస్త వంగిన పొజిషన్‌లో ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. మీ తొడలు నేలకి సమాంతరంగా ఉండాలి. 15 సెకన్లపాటు అలాగే ఉండాలి. ఆపై పునరావృతం చేయాలి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ లాభం ఎక్కువగా ఉంటుంది.

విరప్రదాసనం..

దీనికి మొదట నేరుగా నిలబడాలి. ఆ తర్వాత వెనుక మడమలను నేలపై ఉంచాలి. మోకాళ్లు వాటి ప్రారంభ స్థానం నుంచి చాలా దూరం కదలకుండా జాగ్రత్త పడాలి. ఈ స్థితిలో మీ శరీరాన్ని సమతుల్యంగా ఉంచండి. మీ శరీర పైభాగాన్ని పక్కకి తిప్పడానికి ప్రయత్నించండి. రెండ చేతులను రెండు వైపులా చాచాలి. ఈ స్థితిని మార్చే ముందు కనీసం 5 సార్లు శ్వాస తీసుకోవాలి. ప్రతిసారీ బిగ్గరగా శ్వాస తీసుకోవాలి. మీ శ్వాసకోశ వ్యవస్థలో ఏకాగ్రత పెరిగి, రక్త ప్రవాహాం జరుగుతుంది. దీన్ని 15 సెకన్లపాటు చేసి పునరావృతం చేయాలి.

మీ చేతులను చాచి అరచేతులు ముందుకు ఉండేలా వెళ్లాకిలా పడుకోవాలి. మీ తల కాస్త పైకి ఎత్తాలి. చేతులను భుజాల కింద ఉంచాలి. పొత్తికడుపును నేలపై సమాంతరంగా ఉండేలా చూడాలి. 10 సెకన్ల పాటు అలాగే ఉంచి, మళ్లీ ప్రయత్నించాలి. ఇలా చేయటం ద్వారా కూడా కాలరీలు త్వరగా కరుగుతాయి.

బోట్‌..

ఈ ఆసనం నేలకి సమాంతరంగా పడుకుని, మీ చేతులను దగ్గరగా ఉంచడం ద్వారా చేయవచ్చు. ఇది చేయడం సులభం అయినప్పటికీ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మీ చేతులు, కాళ్లు వీ ఆకారంలో ఏర్పరచుకునేలా క్రమంగా మీ శరీర పైభాగం, కాళ్లను పైకి లేపాలి. మీ చేతులను నేలకి సమాంతర షేప్‌లో ఉండాలి. ఈ ఆసనాన్ని 10 సెకన్లపాటు కొనసాగించి ఆపై పునరావృతం చేస్తూ ఉండాలి.

వీటికి సంబంధించి పూర్తి అవగాహన రావాలంటే..వీడియోలు చూస్తే మీకు ఇంకా బాగా అర్థంమవుతుంది. ముఖ్య గమనిక ఏంటంటే..యోగసనాలు ఎలాపడితే అలా చేయకూడదు. మొదట నిదానంగా చేస్తూ చేస్తూ వాటిపై మంచి గ్రిప్ వచ్చాకా చేసుకోవచ్చు.