రోజూ మనం వంటల్లో నెయ్యిని వాడుతూవుంటాము. వంటల్లో ఉపయోగించడం వల్ల రుచి వస్తుంది. పైగా నెయ్యిని ప్రతి రోజు తినడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలని మనం పొందొచ్చు. చాలామంది ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ కొందరికి వీలు లేక సమయం సరిపోక నెయ్యిని బయటకొంటూ ఉంటారు. ఒకసారి మనం కొనే నెయ్యి కల్తీ అవ్వచ్చు. కల్తీ నెయ్యి ని ఎలా కనిపెట్టచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
డబల్ బాయిలింగ్ చేయండి:
స్వచ్ఛమైన నెయ్యి అనే సందేహం మీకు కలిగితే డబుల్ బాయిలింగ్ పద్ధతి ఉపయోగించండి. మీరు డబుల్ బాయిలింగ్ పద్ధతిని ఉపయోగించి టెస్ట్ చేసి తర్వాత ఫ్రిజ్లో పెట్టండి. ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత నెయ్యికి కనుక పొరలు వచ్చిందంటే అది కల్తీ అని మనం కనిపెట్టొచ్చు.
అరచేతిలో నెయ్యి వేసి చూడండి:
సులభంగా మనం అరచేతిలో నెయ్యి వేసి టెస్ట్ చేసుకోవచ్చు. అరచేతిలో నెయ్యి వేస్తె కరిగిందంటే స్వచ్ఛమైన నెయ్యి అని.. కరగకపోతే నకిలీది అని మనం కనిపెట్టొచ్చు.
పాన్ లో వేసి టెస్ట్ చేయండి:
స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. గోధుమరంగులోకి మారిందంటే అది స్వచ్ఛమైన నెయ్యి. ఒకవేళ కనుక ఆ నెయ్యి పసుపు రంగులో ఉందంటే అది నకిలీది. ఇలా మనం నెయ్యిని ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు.