ఆరోగ్యానికి మంచి పోషకాహారమే కాదు నిద్ర కూడా చాలా ముఖ్యం. మంచి నిద్రని పొందాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి దానితో పాటుగా తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. మనం తీసుకొనే ఆహారపు అలవాట్లు వల్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. అప్పుడు శారీరకంగా మానసికంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. అయితే రాత్రి నిద్ర బాగా పట్టాలంటే వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.
కాఫీ టీ తీసుకోవద్దు:
రాత్రి నిద్ర బాగా పట్టాలంటే కాఫీ టీల కి దూరంగా ఉండండి. నిద్రపోయే ముందు కాఫీ లేదా టీ తాగితే నిద్ర రాదు.
పిండి పదార్థాలు తీసుకోవద్దు:
బ్రౌన్ రైస్, పాస్తా, బ్రెడ్ వంటి వాటికి రాత్రి దూరంగా ఉండండి. ఇటువంటి పిండి పదార్థాలను తీసుకుంటే నిద్ర పట్టదు.
బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి:
సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల కూడా నిద్ర బాగా పట్టదు. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఫైబర్ ఎక్కువగా ఉండాలి. అలానే పెరుగు పండ్లు కూరలు ఇవన్నీ కూడా చాలా అవసరం.
సరిపడా నీళ్లు తీసుకోండి:
సరిపడా నీళ్ళు తీసుకోవడం కూడా చాలా అవసరం ప్రతి రోజూ కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే డీహైడ్రేషన్ సమస్య తో పాటుగా మరెన్నో సమస్యలు వస్తాయి.
మధ్యాహ్నం భోజనం బాగా చెయ్యండి:
మధ్యాహ్నం భోజనం కూడా మంచిగా ఉండేటట్లు చూసుకోండి సమతుల్యమైన ఆహారం అందేటట్టు చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇలా మీరు ఈ చిట్కాలను అనుసరిస్తే నిద్ర బాగా పడుతుంది తద్వారా ఆరోగ్యం కూడా బాగుంటుంది.