రోగనిరోధక శక్తిని పెంపొందించే రసం…!

-

కరోనా వైరస్ మహమ్మారి అందర్నీ పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇటువంటి సమయంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం…

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి అయితే ఈ రోజు రోగనిరోధకశక్తిని పెంపొందించే రసం గురించి చూద్దాం… రోగనిరోధకశక్తిని పెంపొందించటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఈ రసం కి కావాల్సిన పదార్థాలు:

ఒక స్పూన్ చింతపండు గుజ్జు
టమాటా 1
కరివేపాకు
మిరియాలపొడి ఒకటి లేదా రెండు స్పూన్లు
వెల్లుల్లి రెమ్మలు నాలుగు
పసుపు చిటికెడు
రెండు ఎండుమిరపకాయలు
ఉప్పు రుచికి సరిపడా
జీలకర్ర 1 స్పూన్
ఇంగువ అర టీ స్పూన్
కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్
నూనె ఒక టేబుల్ స్పూన్
ఆవాలు ఒక టేబుల్ స్పూన్

ఈ రసాన్ని తయారు చేసే విధానం:

ముందుగా రెండు ఎండు మిరపకాయలు, మిరియాల పొడి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో నూనె వేసి టమాటా ముక్కలు, కరివేపాకు, పసుపు, సాల్ట్ వేసి ఉడికించాలి.

ఇప్పుడు ఇందాక చేసిన మసాలా కూడా అందులో వేసి చింతపండు గుజ్జు వేసి రెండు కప్పుల నీళ్లు పోయాలి. 10 నిమిషాల పాటు దానిని అలాగే ఉంచి ఇప్పుడు మరొక పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి రసంలో కలిపేయాలి. దీనిని మీరు రైస్ తో తీసుకోవచ్చు. ఇందులో వాడిన పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news