సైకిలింగ్ చేయటం అనేది చాలామందికి చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉంటుంది..కానీ ఒక ఏజ్ వచ్చాకా సైకిలింగ్ చేస్తే..మోకాళ్ల చిప్పలు అరిగిపోతాయ్ అని చాలామందిలో ఒక అపోహ ఉంది..కానీ ఇది అపోహ మాత్రమే కానీ..వాస్తవం ఏమాత్రం లేదు..మనషుల కంటే..జంతువులు ఎంతో స్పీడ్ గా నడుస్తాయి. ఏ జంతువుకి మోకాళ్లనొప్పులు రావు..కానీ మనుషులకే పెద్దయ్యాక ఈ నొప్పులు వస్తున్నాయి. కీళ్లు ఆరోగ్యం దెబ్బతినడానికి ముఖ్యకారణం..వ్యాయామం చేయకపోవడం. కదలకుండా కుర్చోవటం వల్ల దెబ్బతింటాయి.
నడవటం కంటే..సైకిలింగ్ అనేది చాలా మంచిది. మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు నడిచేదానికంటే..సైకిలింగ్ చేయటం ఉత్తమం. ఎందుకంటే..బరువు ఎక్కువ ఉన్నవారు..నడుస్తున్నప్పుడు..మోకాలమీద బరువు ఎక్కువ పడుతుంది. ఎక్కువ సేపు నడవలేరు. అదే సైకిల్ అయితే..మన బరువును సీట్ మోస్తుంది. మోకాళ్ల మీద బరువు పడదు. మోకాల మీద భారం లేకుండా తిరుగుతుంది. అలా తిరిగేప్పుడు అక్కడ జిగురు స్రవించే మెకానిజం స్టాట్ అవుతుంది.కీళ్లలో జిగురు ఎంత ఎక్కువగా ఉంటే..మోకాళ్లు అంత ఆరోగ్యంగా ఉంటాయి. మోకాలు కదిపితేనే జిగురు వస్తుంది.
నడిచినా,వ్యాయామం చేసినా,పరుగెత్తినా కీళ్లు అరగవు. మనం మూమెంట్ ఇచ్చే కొద్ది..మోకాళ్లలో జిగురు స్రవిస్తూ ఉంటుంది. జిగురు లేక, వ్యాయామాలు చేయనందువల్ల లిగమెంట్స్ దెబ్బతింటాయి. మజిల్స్ బలహీనపడుతాయి. ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువగా డవలప్ అవుతాయి. నీరు ఎక్కువ చేరుతూ ఉంటుంది. కార్టీలీజ్ దెబ్బతింటాయి. సైకిలింగ్ వల్ల నష్టమే జరగదు. ఎవరికైతే..కార్టలేజ్ మొత్తం దెబ్బతిని పోయి ఎముక ఎముక రాపిడికి గురయ్యే స్టేజ్ కి వస్తుంది. ఇలాంటి వారు సైకిలింగ్ చేసినా పెయిన్ వస్తుంది. అలాంటివారు అసలు నడవకూడదు, సైకిలింగ్ కూడా చేయకూడదు. రెస్ట్ ఇవ్వడం, మోకాళ్ల చిప్ప మార్పించుకోవడం తప్ప ఇంకో పరిష్కారం లేదు.
కానీ కీళ్లనొప్పులు రావడానికి సైకిలింగ్ చేయటం కారణం మాత్రం కాదు. నొప్పులు ఉన్నవారు చేసినా తగ్గుతాయి. ఇతర దేశాల్లో సైకిల్ ట్రాక్స్ అందుబాటులో ఉంటాయి. సైకిలింగ్ చేయటం అలవాటుగా పెట్టుకుంటే..మోకాళ్లనొప్పులను 10-15 ఏళ్లు పోస్ట్ పోన్ చేయొచ్చు. బెస్ట్ వ్యాయామం కింద సైకిలింగ్ ను ఎంచుకోవచ్చు. 100ఏళ్లు సైకిల్ తొక్కినా కీళ్లు అరగవు.
కీళ్లు అరిగిపోవడానికి ప్రధాన కారణాలు..
వ్యాయామం చేయకపోవడం అయితే..సాల్ట్ తినేయటం. అడవిలో ఉండే ఏ జంతువుకి కీళ్లనొప్పులు రావు..కానీ మన ఇంట్లో పెరిగే కుక్కలకు వస్తున్నాయట. ఎందుకంటే..మనం తినే ఆహారమే వాటికి పెడుతుంటాం..కొన్నాళ్లకు వాటి మోకాళ్ల కూడా అరుగుతాయి. మనం తినే ఆహారంలో ఎక్కువై మిగిలిపోయిన ఉప్పు శరీరంలో ఎక్కడ కాళీ ఉంటే అక్కడ పేరుకుపోతుంది. మోకాళ్లలో గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ప్రధానంగా అక్కడే నిల్వఉండిపోతుంది.
అక్కడ సోడియం బై కార్భనేట్..క్రిస్టల్ గా ఫామ్ అవుతుంది. ఇవి కీళ్లలో పేనుండే కార్ట్ లేజ్ ను పాడుచేస్తాయి. అందుకే ఉప్పుమానేస్తే..కీళ్లనొప్పులు అసలు రావు. ఎముకలు చాలా బలంగా ఉంటాయి..కానీ ఉప్పు..మాత్రం అంతటి బలాన్ని తినేస్తాయి. స్టీల్ డబ్బాలో ఉప్పుపెడితే చూడండి ఎలా పాడవుతుందో..మన శరీరాన్ని కూడా ఉప్పు పాడుచేస్తుంది. కాబట్టి ఒక ఏజ్ వచ్చేశాక..ఉప్పులేకుండా తినటం ప్రారంభిస్తే..ఎలాంటి మోకాళ్లనొప్పులు రావు.
కీళ్లనొప్పులతో బాధపడేవారు సైకిలింగ్ ను ఎలాంటి అపోహా లేకుండా చేయటం మొదలుపెట్టండి. మోకాళ్లకు ఎంత మూమెంట్ ఇస్తే..అంత జిగురు ఫామ్ అయి..మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎక్కువగా నొప్పి ఉన్న వారు తప్పా మిగిలిన వాళ్లు అంతా..చేయొచ్చు. వీటితోపాటు..ఉప్పులేకుండా వంటలు చేసుకోవటం ప్రారంభిస్తే..మన ఇంట్లో ఉండే పెద్దోళ్లను ఎన్నోరోగాల నుంచి బయటపడేసిన వాళ్లమవుతాం.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.