ప్రాణం తీసిన మలబద్ధకం.. ఎనిమా చేయడం అంత డేంజరా..?

-

మలబద్ధకం వల్ల మనిషి మానసికంగా, శారీరంగా ఇబ్బందికి గురవుతాడు. కడుపు ఫ్రీగా ఉండదు. పొట్ట తేలిగ్గా ఉంటేనే.. మనకు మంచిగా అనిపిస్తుంది. అది వచ్చిరాక.. ఒక రకమైన చిరాకు ఉంటుంది. బయటకు చెప్పకోలేం. ప్రేగు కదలికలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సాఫీగా మలం బయటకు వస్తుంది. అయితే ఇది మిగతా సమస్యలకంటే ప్రమాదకరమైనది కాదు అని చాలామంది అనుకుంటారు. కానీ మలబద్ధకం ఒక మనిషి ప్రాణం తీసింది తెలుసా..? ఏంటి ఇది కూడా ప్రాణంతకమైనదా అనుకుంటున్నారా..? అవును అసలు బాత్రూమ్‌లో హార్ట్‌ఎటాక్స్ ఎక్కువగా రావడానికి కారణం కూడా ఈ మలబద్ధకమే తెలుసా..? అది రాక. బాగా ప్రజర్‌ పెట్టి ముక్కుతారు. ఆ ఒత్తిడి అంతా గుండెపై పడి.. హార్ట్‌ బీట్‌లో మార్పులు వస్తాయి. ఒకేసారి గుండె వేగంగాకొట్టుకోవడం వల్ల హార్ట్‌ఎటాక్స్‌ వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటనలో మలబద్ధకం సమస్య వల్ల 65 ఏళ్ల వ్యక్తి గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు.

65 ఏళ్ల వ్యక్తి వారం పాటు తీవ్రమైన మలబద్ధకం సమస్యతో బాధపడి ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఛాతీ నొప్పి, వికారం, టాయిలెట్ రాకపోవడం వల్ల సదరు వ్యక్తి ఒక రోజు హాస్పిటల్ కి వెళ్ళాడు. సుమారు పది రోజుల నుంచి టాయిలెట్‌కి వెళ్లలేదని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు డాక్టర్‌కి చెప్పాడు. అతడిని కొలంబియాకి చెందిన ఫేమస్ డాక్టర్ రౌడీ రియల్స్ రోయిస్ పరిశీలించారు.

అతడికి ఎలక్ట్రో కార్డియోగ్రామ్ చేశారు. కానీ రోగి హృదయ స్పందన రేటు పెరుగుతూ విపరీతమైన చెమటతో కనిపించాడు. అతనికి గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయట. దీంతో అతనికి రెక్టల్ ఎనిమా ఇవ్వడం మంచిది కాదని రోయిస్ భావించాడు. దానికి బదులుగా మందులు తీసుకుని మలబద్ధకం సమస్యని తగ్గించాలని వైద్యుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అరుదైన సందర్భాల్లో ఎనిమా చేయడం వల్ల అది మూత్రపిండాలు, గుండెపై ప్రాణాంతకమైన దుష్ప్రభావాలు ప్రేరేపిస్తుంది. కానీ మందులు వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు.

మందుల మోతాదుని పెంచారు. బెడ్‌కే పరిమితం కాకుండా నడుస్తూ ఉండమని వైద్యులు చెప్పారు. కానీ రోగి మాత్రం డాక్టర్ లేని సమయంలో ఎనిమా చేయించుకోవాలని చాలా పట్టుబట్టాడు. మరొక డాక్టర్‌తో ఆ ప్రక్రియ పూర్తి చేశాడు. దీంతో అతడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఎనిమా చికిత్స ద్వారా రోగి మలం బయటకి పంపడం వల్ల అతడి గుండె ఆగిపోయింది. ఆ ప్రక్రియ వాగస్ నాడిని మీద తీవ్ర ఒత్తిడిని కలిగించింది. దీంతో రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయింది. 30 నిమిషాల పాటు అతడిని బతికించేందుకు డాక్టర్ రోయిస్ ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది.

మలబద్ధకం వల్ల తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్ల పురీషనాళం ప్రొలాప్స్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇది పేగు అడ్డంకికి దారి తీస్తుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకమైంది. అటువంటి పరిస్థితిలో హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక్కసారిగా పేగులను ఖాళీ చేయడం వల్ల వాగస్ నాడి దెబ్బతిని ఈ పరిస్థితి తలెత్తుతుంది. రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల గుండె, మెదడు, ఇతర అవయవాలకు తగినంత రక్త ప్రసరణ జరగదు. దీని వల్ల రోగులు గుండె పోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఈ రోగి విషయంలోనూ ఇదే జరిగింది డాక్టర్లు తెలిపారు. కాబట్టి మలబద్ధకం ఉండే.. పరిస్థితి మరీదిగజారకముందే..ఆహారంలో మార్పులు చేయడం అయినా ప్రయోజనం లేకుంటే.. వైద్యులను సంప్రదించడం వంటివి చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news