గర్భసంచి చిన్న సైజులో ఉంటే ప్రెగ్నస్సీ రావడం కష్టమేనా..?

-

గర్భం దాల్చడం అనేది చిన్న విషయం కాదు.. కొంతమందికి మాత్రమే అంతా సాఫీగా అవుతుంది. చాలామంది అనేక రకాలు గర్భసంచి సమస్యలతో నేటికీ పిల్లలు పుట్టలేక బాధపడుతున్నారు. ఇంకా వారికి గర్భసంచికి సంబంధించి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయని వాళ్లు పెళ్లే గర్భంధరించే వరకూ తెలుసుకోరు. కామన్‌గా ఉండే సమస్యల్లో ఒకటి..గర్భాశయం చిన్నదిగా ఉండటం. ఇలా ఉండటం వల్ల ప్రెగ్నెస్సీ రావడానికి, బిడ్డకు జన్మనివ్వడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. వీటికి కారణాలేంటి, పరిష్కారా మార్గాలు కూడా ఓసారి చూద్దాం..!

యుక్తవయసు దాటిన స్ర్తీలలో గర్భసంచి సుమారు 8 నుండి 9 సెంటీమీటర్ల పొడవు, 5 నుండి 6 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. గర్భసంచి పరిమాణం విషయంలో అందరికీ తేడాలు ఉంటాయి. ఈ పరిమాణంలో ఉండే గర్భసంచి ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ బరువులో ఎనభై గ్రాముల నుంచి కేజీ వరకు పెరగుతుంది. అలాగే కొలతలో కూడా 8 నుంచి 9 సెంటీమీటర్లు ఉండే గర్భసంచి ప్రెగ్నెన్సీ సమయంలో 32 – 36 సెంటీమీటర్ల వరకు, కవలలు ఉన్న సందర్భాలలో ఇంకా కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది.

ఎందుకు గర్భాశయం చిన్నగా ఉంటుంది..?

గర్భసంచి సైజు కొన్ని సార్లు జన్యు ఆధారితంగా, కొన్నిసార్లు హార్మోన్ల లోపాల వల్ల చిన్నదిగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లను వైద్యులు సూచిస్తారు. వీటి వల్ల సరైన సైజులో గర్భసంచి పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు.. కానీ పనితీరును మాత్రం క్రమబద్ధీకరించడానికి ఈ ట్యాబ్లెట్లు ఎంతోకొంత ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.

స్వల్పంగా సైజు తక్కువగా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బంది కలగకపోవచ్చు. కానీ సైజు బాగా తక్కువ ఉన్న పరిస్థితులలో అబార్షన్లు అవడం, నెలలు నిండకుండానే బ్లీడింగ్ కావటం, ప్రీ టెర్మ్ డెలివరీ అవ్వటం, బరువు తక్కువగా ఉన్న పిల్లలు పుట్టడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చినట్లయితే సహజంగానే ప్రెగ్నెన్సీ వచ్చేందుకు అవకాశం ఉంది. చిన్న సైజు గర్భసంచి ఉన్నవారు వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news