రాజధానిపై నిర్ణయం తీసుకునే అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది : మంత్రి అమర్‌నాథ్‌

-

ఏపీలో రాజధాని రగడ రగులుతూనే ఉంది. అయితే తాజాగా రాజధాని విషయంలో తమ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం పట్ల ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం అనే అంశాన్ని పిటిషన్ లో ప్రస్తావించామని వెల్లడించారు గుడివాడ అమర్ నాథ్.

Jagan Govt Running Belt Shops? Minister Gudivada Amarnath Admits!

వికేంద్రీకరణపై రాష్ట్రం చేసిన చట్టం చెల్లదన్న హైకోర్టు నిర్ణయాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం దృష్టి తీసుకెళ్లామని అమర్ నాథ్ వివరించారు. రాజధానిపై నిర్ణయం తీసుకునే అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని రాజ్యాంగం చెబుతోందని గుడివాడ అమర్ నాథ్ ఉద్ఘాటించారు. ఏపీలో మూడు రాజధానులకు న్యాయపరమైన అనుమతులు పొందే దిశగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తొలి అడుగు అని గుడివాడ అమర్ నాథ్ అభివర్ణించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news