బరువు తగ్గడానికి బియ్యం పక్కన పెట్టాల్సిన అవసరం ఉందా?

-

బరువు తగ్గాలనే ఆలోచన వచ్చినపుడు బియ్యాని పక్కన పెట్టాలని చాలామంది సూచిస్తుంటారు. బియ్యాన్ని తమ డైట్ లో నుండి పక్కన పెట్టినపుడు మాత్రమే బరువు తగ్గగలరు అని చెబుతుంటారు. అది నిజంగా నిజమేనా? బరువు తగ్గాలంటే ఖచ్చితంగా బియ్యాన్ని పక్కన పెట్టాల్సిందేనా అన్న సంగతి ఇప్పుడు చూద్దాం.

బియ్యంలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇంకా కొవ్వు తక్కువగా ఉంటుంది. అదీగాక మన దేశంలోని ఎన్నోకుటుంబాలకు ఇది ప్రధాన ఆహారం. కూరల్లో నంజుకుని తినడానికి బాగా సరిపోతుంది కాబట్టి అన్నం తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. చాలామంది దీన్ని ఇష్టపడకపోవడానికి కారణం అందులో పిండి పదార్థాలు ఉన్నందునే.

మీరు బరువు తగ్గాలని అనుకున్నప్పుడు అన్నం తినాలా వద్దా?

బరువు తగ్గాలని అనుకునే వారు కేలరీల లోటు ఉండేలా చూసుకోవాలి. దానికోసం బియ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. అదేకాదు బియ్యం త్వరగా జీర్ణం అవుతుంది. అందుకే పూర్తిగా మానేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎంత మొత్తం బియ్యాన్ని తీసుకోవాలి?

ఉడకబెట్టిన అన్నాన్ని తీసుకోవడం మంచిది. అన్నం తినడానికి ముందు లేదా తీసుకున్న తర్వాత పిండి పదార్థాలను తీసుకోవద్దు. దీనివల్ల బరువు అదుపులో ఉండదు.

వీలైనన్ని కూరగాయలను చేర్చండి

ఫైబర్, ప్రోటీన్ ఉన్న కూరగాయలను ఆహారంలో చేర్చుకోండి. బ్రోకలీ, చికెన్, బీన్స్ మొదలగు వాటితో అన్నం తినవచ్చు.

క్రమం తప్పని వ్యాయామం, ఆహార నియంత్రణ, రాత్రిపూట ఎక్కువగా తినకపోవడం మొదలగునవి బరువును తగ్గించడంలో కీలకంగా ఉంటాయి. అందువల్ల ఇవన్నీ పాటిస్తే బియ్యం తీసుకున్నా కూడా సులభంగా బరువు తగ్గవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news