పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ప్రత్యేకం.. గబ్బర్ సింగ్ స్పెషల్ షో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో ఉత్సాహం వచ్చేస్తుంది. అదే తెర మీద కనిపిస్తే పూనకాలు వచ్చేస్తాయి. కోట్లాది గుండెల్లో పవర్ ఫుల్ హీరోగా నిలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం రేపే. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి అభిమానులంతా సిద్ధం అవుతున్నారు. సోషల్ మీడీయా రికార్డులను బద్దలు కొట్టడానికి పవన్ అభిమానులు రెడీగా ఉన్నారు. ఐతే అటు పవన్ అభిమానులను ఉర్రూతలూగించడానికి స్పెషల్ షోస్ సిద్ధం అవుతున్నాయి.

అవును, పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబరు 2వ తేదీన స్పెషల్ షోస్ పడుతున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య 70ఎమ్ ఎమ్ థియేటర్లో గబ్బర్ సింగ్ ప్రత్యేక ప్రదర్శన జరగనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద సూపర్ హిట్టో చెప్పాల్సిన పనిలేదు. పవన్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా గబ్బర్ సింగ్. ఒక అభిమానిగా పవన్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది చూపించిన దర్శకుడు హరిష్ శంకర్. మరి అలాంటి సినిమా పవన్ పుట్టినరోజు మళ్ళీ థియేటర్లో ప్రదర్శితం అవుతుంది.