షుగర్ ఉందా..? అయితే వేసవి కాలంలో తప్పక వీటిని పాటించండి..!

-

వేసవికాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా షుగర్ బిపి తో ఉన్నవాళ్లు కచ్చితంగా ఆరోగ్యం విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలి మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం వేళకి మందులు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా పాటించాలి. వేసవిలో ఎండలు విపరీతంగా మండిపోతు ఉంటాయి. హై టెంపరేచర్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి దీంతో డిహైడ్రేషన్ సమస్య కలగొచ్చు ఇది ప్రమాదకరంగా మారొచ్చు. కాబట్టి వేసవికాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

 

డిహైడ్రేషన్ సమస్య వేసవిలో ఎక్కువగా ఉంటుంది దీని వలన డయాబెటిస్ లో బాధపడే వాళ్ళకి ప్రమాదం కలగచ్చు కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉండాలంటే డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు డిహైడ్రేషన్ సమస్య కలగకుండా ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి దాహం వేసిన లేకపోయినా కూడా నీళ్లు ఎక్కువ తీసుకుంటూ ఉండండి దీంతో డిహైడ్రేషన్ సమస్య ఉండదు అలానే డయాబెటిస్ ఉన్నవాళ్లు సరిగ్గా మందులు వేసుకోండి. మందులను ఎప్పుడూ కూడా డైరెక్ట్ సన్ లైట్ లో పెట్టకూడదు చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి ఇన్సులేటెడ్ బ్యాగ్ ని ఉపయోగిస్తే మంచిది.

అలానే డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ఎండలో తిరగడం మంచిది కాదు వీలైనంత వరకు ఇంటిపట్టునే ఉండాలి. లేత రంగు దుస్తులను ధరించడం మంచిది అలానే కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది వెంటిలేషన్ వుండే చోట ఉండడం మంచిది. ఎండ డైరెక్ట్ గా తగిలే చోటకి వెళ్ళకండి సాయంత్రం పూట మాత్రమే బయటికి వెళ్ళండి. ఉదయం మధ్యాహ్నం ఇంట్లో ఉండటమే మంచిది లేదంటే 11 అవ్వకుండా ఉదయాన్నే మీ పనులు చేసుకోండి డయాబెటిస్ ఉన్నవాళ్లు వీటిని కచ్చితంగా ఫాలో అయితే ఏ సమస్య లేకుండా ఉండొచ్చు ఇబ్బందులు రావు.

Read more RELATED
Recommended to you

Latest news