యూరిన్ నుండి చెడ్డ వాసన వస్తోందా..? అయితే ఈ సమస్యలు వున్నట్టే..!

-

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే యూరిన్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెలుపుతుంది. యూరిన్ రంగు, వాసన బట్టి మనం అనారోగ్య సమస్యల్ని కనుక్కోవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యూరిన్ ఇన్ఫెక్షన్:

మీరు యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతుంటే అమోనియా వాసన యూరిన్ నుండి వస్తుంది. అయితే కేవలం వాసన ని బట్టీ చెప్పలేము. రక్తం పడటం, మంటగా ఉంటడం వంటి లక్షణాలూ ఉంటే అప్పుడు ఈ సమస్య ఉందని చెప్పొచ్చు.

షుగర్:

కుళ్లిన పండ్ల వాసన లాగ యూరిన్ నుండి స్మెల్ వస్తుంటే మూత్రంలో గ్లూకోజ్‌‌‌‌ ఎక్కువగా వుండడమని. కనుక ఇలా వాసన వస్తే ఓ సారి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి.

బ్లాడర్ సమస్య:

బాక్టీరియల్ వాగినోసిస్ వంటి మూత్రాశయ ఇన్ఫెక్షన్‌స్ ఉంటే అప్పుడు యూరిన్ నుండి దుర్వాసన వస్తుంది.

మాపుల్ సిరప్ మూత్ర వ్యాధి:

ఇది చాలా రేర్ గా వస్తుంది. ఈ సమస్య తో వుండే పిల్లల యూరిన్ నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. మాపుల్‌ సిరప్‌ యూరిన్‌ సమస్య ఉంటే నిద్రలేమి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనపడతాయి.

గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్య:

గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్లాడర్ ఫిస్టులా మూలంగా కూడా యూరిన్ నుండి చెడ్డ వాసన వస్తుంది. కనుక జాగ్రత్తగా గమనించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news