పెద్ద మొత్తంలో పాలకోసం డైరీ ఫామ్ లను ఏర్పాటు చేస్తారు..పాలను సేకరించడంలో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి..పాల కేంద్రమునకు వచ్చిన పాలను గ్రేడింగ్ చేసి, దించుకొని, వాటి యొక్క పరిమాణoను కొలచుకోవాలి లేదా బరువు తూచి, పాల కేంద్రంలోని పోయాలి. పాల కేంద్రంలో పాల గ్రేడింగ్ అత్యంత ప్రాముఖ్యమైన ప్రక్రియ. ఎందుకనగా పాల నుండి తయారయ్యే అన్ని రకముల ఫైనల్ ప్రాడక్ట్లు మనం ముందు సేకరించే పచ్చి పాల మీద ఆధారపడి ఉంటుంది ..
ఇక పాల ధర కూడా నాన్యతను బట్టి ఉంటుంది..పాలను గ్రేడింగ్ చేయుటకు ప్లాట్ ఫామ్ పరీక్షల అయిన వాసన, రుచి, ఆమ్లత్వం మరియు సెడిమెంట్ వంటి లక్షణాలను పరీక్షించవలసి ఉంటుంది..ఇవి అందరికి తెలిసినవే..డైరీలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
పాలలో నీళ్ళను కలిపినప్పుడు లాక్టోమీటర్ రీడింగ్ తగ్గిపోతుంది. ఫలితంగా ఈ పరీక్ష పాలు నీళ్ళతో ఏమైన కల్తీ అయినవి, లేనిది తెలుసుకొనుటకు ఉపయోగిస్తుంటారు.లాక్టోమీటర్ వలన ఉపయోగాలు మరియు చాలా వరకు నిరుపయోగాలు కూడా కలవు…
పాల యొక్క నాణ్యత పరీక్షలను తెలుసుకొనుటకు పాల యొక్క నమునాను సేకరించవలసి ఉంటుంది. దీనికి ఈ క్రింది పరికరాలు అవసరం..
డిప్పర్
ఐస్ బాక్స్ లేదా ఇగ్లూ బాక్స్
అజిబెటర్ లేదా వంజర్
పాలను సేకరించుట..
పాల నమునాను సేకరించడానికి, ముందుగా పొదుగును 1.1000 పొటాషియం పర్మాంగనెంట్ ద్రావణం లేదా ఇతర అంటి సెప్టిక్ ద్రావణంతో శుభ్ర పరచాలి. తరువాత చనులను పాడిబట్టతో శుభ్రంగా తుడవాలి. మెదటగా వచ్చే కొన్ని పాల ధారలను వదిలిపెట్టి, తరువాత వచ్చే పాలను నేరుగా శాంపిల్ బాటిల్లోకి తీసుకొవాలి. దీనిని వెంటనే ఐస్ బాక్స్ లో పెట్టి ల్యాబ్ కు పంపించాలి..
పాల క్యాన్ నుండి నమునాను సేకరించుట..
మొట్టమొదటి పంజర్తో పాలను బాగా కలపాలి. తరువాత డిప్పర్తో పాలను తీసుకోని శుభ్రమైన గాజు బాటిల్లోకి సేకరించి, మూత పెట్టి,ఐస్ బాక్స్లో ఉంచి, ప్రయోగశాలకు పంపించాలి..
ట్యాంకర్ నుండి పాల నమునాను సేకరించుట..
ట్యాంకర్లోని పాలను కూడా ప్లంజర్తో బాగా కలపి, ట్యాంకర్ యొక్క ఆవుట్లెట్ ద్వారoను తెరిచి, ముందుగా వచ్చు పాలను ప్రక్కకు తీసి, తరువాత వచ్చు పాలను నేరుగా శాంపిల్ బాటిల్లో సేకరించి, ఐస్ బాక్స్లో ఉంచి, ప్రయోగశాలకు పంపించాలి..
కొన్ని కారణాల వల్ల పాల నమూనాలను ల్యాబ్ పంపించడం లేటు అయితే..పాల నమునాలకు ప్రిజర్వేటివ్ అయిన మెర్కూరిక్ క్లోరైడ్ లేదా 40 శాతం ఫార్మాలిన్ లేదా పోటాషియం డై క్రోమెట్ వంటి రసాయనాలను కలిపి పంపించాలి..