నేరేడు పండు ఇన్ని వ్యాధులకు పని చేస్తుందా…?

-

నేరేడు పండు. ఇది ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుంది. నేరేడు పండు ఎండాకాలం చివర్లో, వర్షాలు మొదలయ్యే సమయంలో మాత్రమే దొరుకుతుంది. నేరేడు పండు రుచి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. కొంచెం వగరు, తీపి కలయిక తో దీని రుచి ఉంటుంది. నేరేడు పండును పోషకాలు గని అని చెప్పాలి. ఎందుకంటే మనకు కావలసిన చాలా రకాల పోషకాలు ఈ నేరేడు పండ్లలో ఉన్నాయి.

ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే గుణం నేరేడు పండు కలిగి ఉందని ఎన్నో పరిశోధనలు చేసిన వైద్యలు చెపుతున్నారు. ఇందులో పొటాషియం , ఫాస్పరస్, ఐరన్, కాల్షియం కూడా ఉన్నాయి. ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ కూడా ఈ పండులో వున్నాయి.చాలా మందికి కడుపులో గ్యాస్‌ చేరి ఏం తిన్నా అరగనట్లుగా అనిపిస్తుంది. ఒక్కోసారి వాంతి చేసుకోవాలన్న భావన కూడా కలుగుతుంది.

ఇలాంటప్పుడు నాలుగైదు నేరేడు పళ్లను తింటే ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడినీ తగ్గిస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు ఈ నేరేడు పండ్లను తినడం మంచిది. ఎందుకంటే ఈ పండులో సహజమైన యాసిడ్ లు ఉన్నాయి. అవి కాలేయాన్ని శక్తివంతం చేసి దాని పని తీరును మెరుగుపరుస్తాయి. ఫైల్స్ తో బాధ పడే వారికి నేరేడు బాగా పని చేస్తుంది.

ఈ పండ్లను అవి దొరికే కాలంలో ప్రతి రోజు ఉదయం ఉప్పుతో కలిపి తింటే మంచి ఫలితం కలినిపిస్తుంది. ఈ మధ్య అందరూ నేరేడు పండు ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుచేత నేరేడు పండ్లను ఉపయోగించి ఐస్ క్రీం , వైన్ , జ్యూస్, జెల్లి, జాం వంటివి ఎక్కువగా తయారు చేస్తున్నారు. ఇన్ని మంచి గుణాలు కలిగిన ఈ పండ్లను ఎక్కువగా తింటే గొంతు పట్టేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మితంగా తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news