కిడ్నీ రోగులు ఇది తాగితే మీ ఆయుష్షుకు ఢోకా లేదు..

-

ప్ర‌స్తుత స‌మాజంలో అధిక శాతం మంది కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. వీటికి కారణాలు అనేకంగా ఉంటున్నాయి. ఆహార అల‌వాట్లు, జీవ‌న‌శైలి ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల కిడ్నీ స‌మ‌స్య‌ల‌కు దారితీస్తాయి. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవాల్సి వ‌స్తుంది. ఈ నేపథ్యంలోనే కిడ్నీ వ్యాధులు వచ్చాక బాధపడడం కంటే అవి రాకముందే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది. అయితే దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులు కాఫీ తాగడం వల్ల మరింత కాలం జీవించవచ్చని ఓ అధ్యాయనంలో తేలింది.

coffee

మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు రోజూ కప్పు కాఫీ తాగితే మరణం ముప్పు తగ్గుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాఫీలో ఉండే కెఫిన్‌ వారి ఆయుష్షును పెంచుతుందని 2328 మందిపై నిర్వహించిన పరీక్షల్లో తేలిందని పోర్చుగల్‌కు చెందిన సెంట్రో హాస్పిటాలర్‌ లిస్బోవా నోర్ట్‌ పరిశోధకులు వెల్లడించారు. వయస్సు, లింగం, వార్షికాదాయం, శరీర రక్తపోటును పరిశీలించి, తగు మోతాదులో కాఫీ తాగించగా ఆశాజనక ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. తక్కువగా కాఫీ తాగేవారిలో 12 శాతం, మోస్తారుగా తాగేవారిలో 22 శాతం, ఎక్కువగా తాగేవారిలో 24 శాతం ప్రాణహాని ముప్పు తగ్గినట్లు గమనించారు.

Read more RELATED
Recommended to you

Latest news